YS Sharmila: డీకే శివకుమార్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పిన షర్మిల..

డీకే. శివకుమార్‌తో మాకు ముందునుంచి పరిచయం ఉంది. వైఎస్సార్‌ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు.

YS Sharmila: డీకే శివకుమార్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పిన షర్మిల..

YS Sharmila

YSR Telangana Party: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంకోసం ఆ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారని, అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. డీకే. శివకుమార్‌తో మాకు ముందునుంచి పరిచయం ఉంది. వైఎస్సార్‌ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు. వైఎస్సార్ లా కష్టపడ్డాడు కాబట్టి కర్నాటకలో అధికారంలోకి వచ్చాడు. ఆయన లేకుంటే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదని షర్మిల అన్నారు. అందుకే శివకుమార్‌ను కలిసి అభినందనలు తెలియజేశానని చెప్పారు.

YS Sharmila: నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు.. తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు.. 44 సీట్లలో గెలుస్తున్నాం..

కర్ణాటక ఫలితాలు మతరాజకీయాలకు, కుల్లు రాజకీయాలకు చెంపపెట్టు. అక్కడ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ పార్టీని బొందపెట్టడం ఖాయం. కర్ణాటక కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసేవాళ్లు ఉన్నారు. డీకే శివకుమార్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డారని షర్మిల అన్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ విజయంలో పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు. షర్మిల బెంగళూరు వెళ్లి శివకుమార్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.