తప్పుడు రాతలు ఆపండి.. పాక్ మీడియా కథనంపై పవన్ కళ్యాణ్

  • Publish Date - March 2, 2019 / 03:04 AM IST

యుద్ధం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో పాటు పాకిస్తాన్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జరిగిన ప్రచారం మీడియా సృష్టే అని ఆయన స్పష్టం చేశారు.
Read Also : శ్వాసనాళాలు కాలిపోయాయి : రవళి హెల్త్ కండీషన్

ఈ మేరకు జనసేన తన అధికార ట్విట్టర్ పేజ్ ద్వారా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. ఎన్నికలకు ముందు యుద్ధం వంటివి చోటు చేసుకుంటాయని తనకు నేరుగా ఎవరూ చెప్పలేదని, రాజకీయ విశ్లేషకులు, కొన్ని మీడియా సంస్థలు చెప్పిన జోస్యాన్ని ఉదహరించానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇండియన్ మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జనసేన వీడియోని ట్విట్టర్ లో పెట్టింది. “చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు. పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి” అని పవన్ అన్నట్లుగా వీడియోలో ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో బీజేపీ మాట ఎక్కడ ఉందంటూ జనసేన ప్రశ్నించింది. తన వ్యాఖ్యల్లోకి బీజేపీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తనకు బీజేపీ చెప్పిందని పవన్ ఎక్కడా చెప్పలేదని, ఇలాంటి తప్పుడు వార్తలు వద్దని జనసేన సూచించింది. ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లను కూడా జనసేన ప్రస్తావించింది.
Read Also : మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

 

‘యుద్ధం ఎలా వస్తుందనేది రెండేళ్ల ముందే ఎలా తెలుసునని అంటే.. నాకేం తెలుసు, నేను ఏమైనా పాకిస్తాన్ వాళ్లతో మాట్లాడలేదు’ అని పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కూలుతుందని కొంతమంది ముందే జోస్యం చెప్పేవారని, అలాగే, మన దేశంలో యుద్ధం రాబోతుందని చెప్పేందుకు ముఖ్యంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారని, అలాంటివి చదివితే తెలుస్తుందని, ఇంటర్నెట్లో ఉంటే తెలుస్తుందని పవన్ అన్నారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లాంటివి చదివితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కొందరు ఊహిస్తారని, అలాగే ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో కూడా చెబుతారన్నారు. ఇది కూడా తన జోస్యం కాదని, ఇతరులు చెప్పిన దానిని నేను చెప్పానంటూ పవన్ అన్నారు.

 

Read Also : ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్

ట్రెండింగ్ వార్తలు