Abhay Patel: సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ లో తెలంగాణ, కర్నాటక ఇంఛార్జ్ ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పటేల్, కర్నాటక వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మధ్య సై అంటే సై అనేంత రేంజ్ లో మాటల యుద్ధం జరిగినట్లు పార్టీ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొన్న తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పటేల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన తిరంగా యాత్ర చాలా బాగా జరిగిందన్నారు.
అదే తన సొంత రాష్ట్రం కర్నాటకలో మాత్రం అంత బాగా జరగలేదన్నారు. దీంతో కర్నాటక ఇంఛార్జ్ గా ఉన్న పొంగులేటి.. అభయ్ పటేల్ తీరుపై మండిపడ్డారు. పొంగులేటి తీరుపై మిగతా నేతలు స్పందించారు. కర్నాటక ఇంఛార్జ్ గా ఉన్న పొంగులేటికి ఇక్కడ పెత్తనం ఏంటని ప్రశ్నించారట. ఏదైనా ఉంటే కర్నాటకలో చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నట్లు సమాచారం.
సీరియస్ మీటింగ్ జరిగితే వెనుకాల కూర్చుని ముచ్చట్లు పెట్టడం సరికాదని అభయ్ పటేల్ హెచ్చరించారట. అంతేకాదు మీడియాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని తేల్చి చెప్పారట. ఎంతటి వారైనా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారని సమాచారం. మూడు నాలుగు సార్లు గెలిచాం కాబట్టి మేము ఏది మాట్లాడినా సాగుతుంది అనుకోవడం సరైనది కాదన్నారట. మీరు మాట్లాడే మాటలతో పార్టీకి నష్టం జరుగుతుంది, కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే తనదారి తనకు చూపించామన్నారట.
Also Read: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్
ఇన్ డైరెక్ట్ గా రాజాసింగ్ ను ఉద్దేశించి అభయ్ పటేల్ అలా అన్నాడని బీజేపీ నేతలు అనుకున్నారట. సోషల్ మీడియాలో పార్టీ నేతలపై వ్యక్తిగతంగా మాట్లాడిస్తున్నారని హెచ్చరించారట అభయ్ పటేల్. యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరున్నారు అనేది విచారణ చేస్తున్నామని.. వాటి వెనుక బిజెపి నేతలు ఉన్నట్టు తేలితే వ్యవహారం సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారట.
”తిరంగా యాత్ర తెలంగాణలో చాలా బాగా జరిగింది, తిరంగా యాత్రలు చేయడంలో తెలంగాణలో బీజేపీ టాప్ లో ఉంది. నాది కర్ణాటక. కర్ణాటకలో కూడా ఇంత బాగా జరగలేదు” అని అభయ్ పటేల్ అన్నారట.
దీనిపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారని సమాచారం. నన్ను అవమానించే విధంగా మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారట. అలా సుధాకర్ రెడ్డి, అభయ్ పటేల్ మధ్య మాట మాట పెరిగిందట. ఇతర బీజేపీ నేతలు పొంగులేటి పై అరిచారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలని చెప్పారట. పొంగులేటి సుధాకర్ రెడ్డి తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయట. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కింద కూర్చుంటే సుధాకర్ రెడ్డి స్టేజ్ పైన కూర్చొని మా హక్కులను డిక్టేట్ చేయడం ఏంటని బీజేపీ నేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మీరు ఇంఛార్జ్ అయితే కర్ణాటకలో చూసుకోమనండి.. తెలంగాణలో ఆయన పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారని సమాచారం.