Nitish Kumar: కాంగ్రెస్‌లో జేడీయూను విలీనం చేయాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు: సీఎం నితీశ్ కుమార్
‘‘జేడీయూని కాంగ్రెస్ లో కలిపేయాలని నాలుగైదేళ్ల క్రితం ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నారు. నేను ప్రశాంత్ కిశోర్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో అది మాట్లాడుకోవచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నేను ఏ సమాధానమూ ఇవ్వను. బీజేపీలో ఆయనకు పదవి దక్కుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

Nitish Kumar Asked Me To Lead His Party says Prashant Kishor
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జేడీయూని నడిపించాలని తనకు నితీశ్ కుమార్ చెప్పారని, అయితే, తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయనతో కలిసి పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ అన్నారు. దీనిపై ఇవాళ నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రశాంత్ కిశోర్ కు ఏదైనా పదవి ఇస్తామని చెప్పి, మళ్ళీ జేడీయూలోకి ఆహ్వానించారా? అని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందిస్తూ… ‘‘జేడీయూని కాంగ్రెస్ లో కలిపేయాలని నాలుగైదేళ్ల క్రితం ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నారు. నేను ప్రశాంత్ కిశోర్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో అది మాట్లాడుకోవచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నేను ఏ సమాధానమూ ఇవ్వను. బీజేపీలో ఆయనకు పదవి దక్కుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. కాగా, గతంలో జేడీయూలో చేరి, ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ అనంతరం ఆ పార్టీని వీడారు. బిహార్ లో సొంత పార్టీ పెట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..