మళ్లీ మొదలు : అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ

  • Publish Date - October 28, 2019 / 03:59 PM IST

ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై  ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని కోరింది. 

ఆ సూచనలను ఈమెయిల్  expertcommittee2019@gmail.com లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. నవంబర్‌ 12లోగా ఈ మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా పంపాలని సూచించింది.

సీఎం జగన్ ఫ్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై  రివర్స్ టెండరింగ్ విధానంలో కొత్త టెండర్లు పిలిచి  రాష్ట్ర ఖజానాపై భారాన్ని తగ్గిస్తోంది. రాజధాని  అమరావతి నిర్మాణంపై పలు ఆరోపణలు రావటంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.