దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో టాప్ – 5లో తెలంగాణ పోలీసు ట్రెండ్ అవుతోంది. ఈ ఎన్ కౌంటర్‌పై టాలీవుడ్‌తో పాటు..ఇతర రంగానికి చెందిన ప్రముఖులు
2019, డిసెంబర్ 06వ తేదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. పోలీసుల చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నారు.
మరోవైపు దిశా ఉంటున్న నక్షత్ర అపార్ట్ మెంట్ వద్ద సంతోషాలు వ్యక్తమౌతున్నాయి. టపాకులు కాలుస్తూ..హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జయహో తెలంగాణ పోలీసు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు స్వీట్లు తినిపించారు. డయల్ 100కు అభినందనలు తెలియచేస్తున్నారు.
నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్ సింగం అంటూ ఒకరు, నేరస్తులకు ఎన్ కౌంటర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీసు అధికారి తెలంగాణాలో ఉన్నందుకు గర్వంగా ఉందని మరొకరు..పోలీసుల చర్యతో ప్రజలు సంతోసంగా ఉన్నారని ఇంకొందరు అటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read More : దిశా కేసు..ఎన్ కౌంటర్ : పోలీసులపై టాలీవుడ్ ప్రశంసలు