Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఒక దారుణ నిరసన వెలుగు చూసింది. ఇక్కడి వీధుల్లో దళిత, ఆదివాసీ యువకులు కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగ్నంగా నిరసన చేపట్టారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుతున్నారని, అయితే వారిని నియంత్రించడంలో భూపేష్ బాఘేల్ సర్కార్ అలసత్వం చూపిస్తోందంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం వెలుగు చూసిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Opposition Meet: విపక్షాల మెగా మీటింగులో అణుబాంబ్ అంతటి ప్రకటన చేసిన కాంగ్రెస్
విధానసభ రోడ్డులో విద్యార్థులు వివస్త్ర ప్రదర్శన చేస్తున్న సమయంలో రాష్ట్ర నాయకులు సభకు హాజరయ్యేందుకు ఆ రోడ్డు గుండా వెళుతున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు విధానసభ రోడ్డులో బట్టలు విప్పి విధానసభ వైపు పరుగులు తీశారు. కాగా, నిరసన చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే దీనిపై రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇలాంటి అసభ్యకరమైన పని తగదని మంత్రి శివ్ దహ్రియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే దాన్ని తగిన విధానంలో తెలియజేయాలని ఆయన అన్నారు.
Opposition Meet: కూటమికి చాలా ఆసక్తికర పేరు ఎంచుకున్న విపక్షాలు.. ఈ పేరు బీజేపీని ఓడిస్తుందా?
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నకిలీ రిజర్వేషన్ సర్టిఫికేట్లు విచ్చలవిడిగా వస్తున్నాయని ఆరోపిస్తూ దాదాపు డజను మంది యువకులు అమాసివాని సమీపంలోని విధానసభ రోడ్‌లో పూర్తిగా నగ్నంగా ప్రదర్శన చేశారు. నకిలీ రిజర్వేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్న వారిపై నిరసన వ్యక్తం చేస్తూ, రిజర్వ్‌డ్ వర్గ ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
వీరి నిరసనపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విచారం వ్యక్తం చేసింది. ‘భూపేష్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కలత చెందిన ఎస్టీ-ఎస్సీ యువత రాజధాని రాయ్‌పూర్‌లో నగ్న ప్రదర్శన చేయవలసి వచ్చింది’ అని బీజేపీ అధికార ట్వీటర్ ఖాతాలో వీడియో షేర్ చేశారు. విద్యార్థుల ఈ ప్రదర్శనపై ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 267 నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిపై భూపేష్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
भूपेश सरकार की नजरअंदाजी से परेशान एसटी-एससी वर्ग के युवा राजधानी रायपुर में नग्न प्रदर्शन करने को हुए मजबूर।
267 फर्जी जाति प्रमाण पत्र बनवा कर सरकारी नौकरी करने वालों के खिलाफ कार्रवाई क्यों नहीं कर रही भूपेश सरकार? pic.twitter.com/TSt1wypzSC
— BJP Chhattisgarh (@BJP4CGState) July 18, 2023
అయితే నకిలీ నియామకాల వ్యవహారం గత ప్రభుత్వానిదేనని అధికార పార్టీ నేత శివ్ దహ్రియా మీడియాతో అన్నారు. అయితే దీనిపై తమ ప్రభుత్వం విచారణ చర్యలు తీసుకుంటుందని, చాలా కేసులపై కోర్టులో స్టే ఉందని అందుకే వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. అయితే ఈ ప్రకటన అనంతరం మరోసారి మాజీ సీఎం రమణ్ సింగ్ స్పందిస్తూ “మా ప్రభుత్వం పోయి 5 సంవత్సరాలు అయ్యింది. అక్రమాలు జరిగితే ఎందుకు సరిదిద్దలేదు? ఎంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం తన లోపాలను ఇతరులపై రుద్దుతుందో, అదే రాగం ఎంత కాలం ఆలపిస్తుందో?’’ అని అన్నారు.
छत्तीसगढ़ में अनुसूचित वर्गों के साथ शोषण का दर दिन प्रति दिन बढ़ता ही जा रहा हैं!
आज से शुरु हुए विधानसभा के मानसून सत्र के बीच राजधानी की सड़कों पर एसटी एससी वर्ग के युवाओं ने नग्न प्रदर्शन किया गया है।
मंत्रियों का काफिला सड़कों से गुजर रहा था। जानकारी के मुताबिक फर्जी… pic.twitter.com/Rc9k6jtj9H
— BJP SC MORCHA भाजपा राष्ट्रीय अनुसूचित जाति मोर्चा (@BJPSCMorcha) July 18, 2023
ఇక బీజేపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫ్రంట్ కూడా దీనిపై స్పందించింది. తమ ట్విటర్ ఖాతాలో “ఛత్తీస్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాల దోపిడీ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేటి నుంచి ప్రారంభమైన విధానసభ వర్షాకాల సమావేశాల మధ్య రాజధాని వీధుల్లో ఎస్టీ, ఎస్సీ యువకులు వివస్త్ర ప్రదర్శన చేశారు. మంత్రుల కాన్వాయ్ రోడ్ల గుండా వెళుతోంది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ/ఎస్టీ యువకులు ఈ ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం’’ అని ట్వీట్ చేశారు.