Opposition Meet: కూటమికి చాలా ఆసక్తికర పేరు ఎంచుకున్న విపక్షాలు.. ఈ పేరు బీజేపీని ఓడిస్తుందా?

బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు.

Opposition Meet: కూటమికి చాలా ఆసక్తికర పేరు ఎంచుకున్న విపక్షాలు.. ఈ పేరు బీజేపీని ఓడిస్తుందా?

Opposition Meeting Bengaluru

Opposiotion Meeting : విపక్ష పార్టీల కొత్త కూటమి పేరు ఇండియా (I.N.D.I.A) అని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఐక్య ఫ్రంట్‌ను రూపొందించడానికి రెండు రోజులుగా 26 ప్రతిపక్ష పార్టీలను చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశంలోనే కూటమికి I-N-D-I-A అనే పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. I-N-D-I-A  అంటే ‘ఇండియన్ నేషనల్ డెవలప్‭మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ అనే పేరుతో అధికార పార్టీని ఎదుర్కోవడానికి మెగా ప్రతిపక్ష ఫ్రంట్‌ ప్రయత్నాలు చేస్తోందట.

Janasena Party: జంపింగ్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!

సమావేశం మొదటి రోజు అనధికారికంగా జరిగింది. చర్చల అనంతరం విందు కొనసాగింది. ఇక రెండవ రోజు మహాకూటమి పేరుతో సమావేశం మరింత లాంఛనంగా జరగనున్నాయి. మొదటిరోజు (సోమవారం) జరిగిన విందు సమావేశంలో కూటమికి ఒక పేరు సూచించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కాగా, రెండవరోజు(ఈరోజు) సమావేశంలో చర్చించి ఏకాభిప్రాయానికి రానున్నారు. ఇక తాజాగా ఏర్పడబోయే కూటమికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్వీనర్‌గా నియమించనున్నారు.

Jagga Reddy – Raghunandan: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

సోనియా గాంధీ 2004 నుంచి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇక ప్రధాన కమిటీకి అదనంగా రెండు సబ్‌కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒకటి ఉమ్మడి కనీస కార్యక్రమంతో పాటు కమ్యూనికేషన్ పాయింట్‌లను ఖరారు చేయడానికి కాగా, మరొకటి ఉమ్మడి ప్రతిపక్ష కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలను ప్లాన్ చేయడానికి ఏర్పాటు చేయనున్నారు.

Opposition Meet: విపక్షాల మెగా మీటింగులో అణుబాంబ్ అంతటి ప్రకటన చేసిన కాంగ్రెస్

బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి తొలిరోజు విపక్షాల సమావేశానికి హాజరుకాలేదు. పవార్ ఈరోజు బెంగళూరుకు వచ్చినప్పటికీ, కుమారస్వామి ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

Greater Noida : టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం .. ఉద్యోగిని జుట్టుపీకి కిందపడేసి కొట్టిన మహిళ..

కాగా దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ “సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమ ఎజెండాను పెంపొందించడానికి సమాన ఆలోచనలు కలిగిన ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేస్తాయి. ద్వేషం, విభజన, ఆర్థిక అసమానత, దోపిడి వంటి నిరంకుశ, ప్రజా వ్యతిరేక రాజకీయాల నుంచి భారతదేశ ప్రజలను విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. దేశం కోసం మేము ఐక్యంగా ఉంటాము’’ అని అన్నారు. ఇక బెంగళూరులో 26 విపక్షాలు సమావేశం అవుతుండగా.. విపక్షాల కంటే ఎక్కువ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో 38 పార్టీలతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీయే సమావేశం జరగనుంది.