ఏపీ సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం

  • Publish Date - December 20, 2019 / 02:43 PM IST

జీఎన్ రావు కమిటీ నివేదిక పై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే  సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు.  కాగా.. ఈ అంశంపై ఇంతవరకు  ఉద్యోగ సంఘాలనాయకుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

కాగా జీఎన్ రావు కమిటీ నివేదికపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహంతో  ఊగిపోతున్నారు.  రాజధాని ప్రాంత  గ్రామ రైతులు పెద్ద ఎత్తున సచివాలయం వైపు దూసుకు వెళ్లారు.  సీఎ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ..జగన్ ఫ్లెక్సీలను చింపివేశారు.  రోడ్లపై టైర్లు వేసి నిప్పుపెట్టి  రైతులు నిరసన తెలుపుతున్నారు. సచివాలయంలోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.