TRS కౌన్సిలర్ కోసం ఆత్మహత్యాయత్నం

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 05:56 AM IST
TRS కౌన్సిలర్ కోసం ఆత్మహత్యాయత్నం

Updated On : January 29, 2020 / 5:56 AM IST

మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. గులాబీ గుబాళించింది. మిత్రపక్షాలు కనీసం ఎలాంటి ప్రభావం చూపించలేకోపోయాయి. కానీ అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. తమకు పదవి ఇస్తామని మొదట చెప్పి మాట మారుస్తున్నారంటూ టీఆర్ఎస్ పెద్దలపై కొందరు గుస్పాగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా కౌన్సిలర్‌గా గెలిచిన ఓ వ్యక్తి పదవికి రాజీనామా చేస్తానని అనడంతో ఓ కార్యకర్త హార్ట్ అయ్యాడు. వెంటనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. 

సూర్యాపేట మున్సిపల్‌కు సంబంధించి 5 వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా షేక్ బాషామియా ఎన్నికయ్యారు. ఎవరూ పోటీకి దిగకపోవడంతో ఆయన ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ పెద్దలు హామీనిచ్చారని అనుచరులు అంటున్నారు. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో బాషా మియా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీంతో కార్యకర్తలు, అనుచరులతో చర్చించాలని అనుకున్నారు.

అందులో భాగంగా 2020, జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం మీటింగ్ ఏర్పాటు చేశారు. తనస్థాయికి తగిన పదవి రాలేదని, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కార్యకర్త సూర్యా నాయక్ చింతించాడు. బయటకు వచ్చి..తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడనే తోటి కార్యకర్తలు వారించే ప్రయత్నం చేశారు. ఒంటిపై నీళ్లు పోసి…ఆత్మహత్య చేసుకోకుండా అడ్డు తగిలారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

Read More : శివ..శివ..చలి పారిపోయిందా : జనవరిలోనే ఎండలు