AP Alliance Politics : టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తుపై ఉత్కంఠ..! ఢిల్లీ చేరిన వ్యవహారం

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

TDP-Janasena-BJP Alliance Updates

AP Alliance Politics : ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇవాళ సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు, సెకండ్ లిస్ట్ పై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

మరోవైపు నెక్ట్స్ లిస్ట్ పై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ, రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

పొత్తుల అంశంలో దాగుడుమూతలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పటి నుంచి పొత్తు ఉంటుందా? ఉండదా? అనే సంశయం ఇప్పటివరకు కొనసాగింది. తాజాగా అందిన కీలక సమాచారం ప్రకారం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కూడా వెళ్లనున్నారు. దీనిపై అధికారికంగా సమాచారం వచ్చింది. టీడీపీ లాంఛనంగా ఎన్డీయేలో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక కమిటీ వేసి టీడీపీ-జనసేనతో ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అదంతా రాష్ట్ర స్థాయిలో జరిగే ఛాన్స్ ఉంది.

Also Read : టీడీపీ 25, జనసేన 10..! కూటమి సెకండ్ లిస్ట్ రెడీ..!

 

 

ట్రెండింగ్ వార్తలు