లోక్‌సభ ఎన్నికలు.. ఉత్కంఠ రేపిన బీజేపీ రెండో జాబితా

ఆరూరి రమేశ్ మెత్తబడతారా? పార్టీని వీడతారా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆరూరి నిర్ణయం తర్వాతే వరంగల్ సీటుపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

Suspense On Bjp Second List

Bjp Second List : బీజేపీ రెండో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ రిలీజ్ చేసే జాబితాలో ఆదిలాబాద్, మెదక్ తో పాటు వరంగల్ సీట్లు కూడా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు అంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేశ్ ను కేసీఆర్ తన ఇంటికి పిలిపించుకుని మరీ బుజ్జగిస్తున్నారు. అయితే, ఆరూరి రమేశ్ మెత్తబడతారా? పార్టీని వీడతారా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆరూరి నిర్ణయం తర్వాతే వరంగల్ సీటుపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

బీజేపీ సెకండ్ లిస్టులో ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈరోజు ఉదయం వరకు కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తుందని, ఆయన వరంగల్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ తర్వాత వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ఆరూరి రమేశ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుంది అని ప్రచారం జరిగింది. అయితే, ఆరూరి రమేశ్ ప్రెస్ మీట్ కు ముందే జరిగిన హైడ్రామాతో బీజేపీ రెండో జాబితాపై కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది.

ఏడు సీట్ల విషయానికి వస్తే.. పెండింగ్ లో ఉన్న 8 సీట్లలో.. ఆదిలాబాద్ మినహా మిగతా ఏడు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు అనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. మెదక్ స్థానానికి సంబంధించి ఒక సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆరూరి రమేశ్ బీజేపీలోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లారు. ఉదయం నుంచి జరిగిన హైడ్రామాతో వరంగల్ స్థానాన్ని కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. బీజేపీలో చేరికపై ఆరూరి రమేశ్ నుంచి ప్రకటన వచ్చాక ఈ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : తెలంగాణలో తీన్మార్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత? 3 ప్రధాన పార్టీల వ్యూహాలు ఏంటి?

 

ట్రెండింగ్ వార్తలు