Swami Prasad Maurya: ఏ ఆలయాన్ని తవ్వినా బౌద్ధ విహారాలే కనిపిస్తాయట.. బద్రినాథ్ వ్యాఖ్యల అనంతరం మరింత ఘాటు పెంచిన స్వామి ప్రసాద్ మౌర్య

స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. "బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చాలా దురదృష్టకరమని అన్నారు

Badrinath Temple Remark: బద్రీనాథ్ ధామ్ ఆలయంపై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన ప్రకటనపై వివాదం తలెత్తింది. మొదట భారతీయ జతాన పార్టీ అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి కూడా మౌర్య ప్రకటనను ఖండించారు. అయితే తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోగా మరింత దూకుడు పెంచారు ఆయన. తాజాగా కొత్త ప్రకటన చేసి రాజకీయాల చర్చలో మరింత హీట్ పెంచారు.

Kashmir Soldier: సెలవుపై ఇంటికొచ్చిన సైనికుడు అదృశ్యం.. వాహనంపై రక్తపు మరకలు.. ఉగ్ర‌చర్యగా అనుమానం..

హిందూ పుణ్యక్షేత్రాలన్నీ బౌద్ధ విహారాల మీదుగా నిర్మించబడ్డాయనడానికి చారిత్రక ఆధారాలు, వాస్తవాలు, సాక్ష్యాలే బలమైన సాక్ష్యాలని మౌర్య అన్న విషయం తెలిసిందే. 8వ శతాబ్దం ప్రారంభం వరకు బద్రీనాథ్ బౌద్ధ విహారమేనని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శల అనంతరం ఆదివారం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ “ప్రతి మసీదులో దేవాలయాన్ని కనుగొనే సంప్రదాయం బీజేపీకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే ప్రతి ఆలయంలోనూ బౌద్ధ విహారాలు కనిపిస్తాయి” అని అన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య “” అన్నారు.

Mayawati: బౌద్ధ విహారాల గురించి బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎస్పీ నేత మౌర్యకు మాయావతి కౌంటర్

స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. “బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చాలా దురదృష్టకరమని అన్నారు. అలాగే మత విశ్వాసాలను కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడటం సరికాదని ధామి అన్నారు. అయితే సీఎం ధామి వ్యాఖ్యలపై స్వామి ప్రసాద్ మౌర్య స్పందిస్తూ “మేము ఆయన మనోభావాలను ప్రభావితం చేశామని అన్నారు. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుందని నేను గుర్తు చేస్తున్నాను. మీకు విశ్వాసం ఉంటే, ఇతర మతాలు, వర్గాల వారికి కూడా విశ్వాసం ఉంటుంది. మీరు మీ విశ్వాసం గురించి ఆందోళన చెందినట్టే, ఇతరులు కూడా ఆందోళన చెందుతారు’’ అని అన్నారు.

Udhayanidhi Stalin: మరి మీ కుమారుడు ఎన్ని పరుగులు చేశాడు అమిత్ షా?: ఉదయనిధి స్టాలిన్

శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ కూడా మౌర్య ప్రకటనను ఖండించారు. దానిని పూర్తిగా అవాస్తవం అని అన్నారు. అనంతరం శంకరాచార్యకి కూడా స్వామి సమాధానం చెప్పారు. “నా ప్రకటన రాజ్యాంగానికి అనుకూలంగా ఉంది. గాలివాటమైన ప్రకటనలు ఇవ్వడం మానుకోండి. మహాపండిట్ రాహుల్ సాంకృత్యాయన్ బద్రీనాథ్ ధామ్‌కి వెళ్లిన తర్వాత తాను రాసిన దాని గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాన్ని గమనించి రావల్‌తో మాట్లాడిన తర్వాత ఆ విగ్రహం బుద్ధుడిదేననడంలో సందేహం లేదు. ఈ విగ్రహం చెక్కుచెదరకుండా ఉంటే ఎంతో అందంగా ఉండేదనడంలో సందేహం లేదు’’ అని మౌర్య అన్నారు.