Mayawati: బౌద్ధ విహారాల గురించి బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎస్పీ నేత మౌర్యకు మాయావతి కౌంటర్

బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్‌తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివాదాలకు తావిస్తోంది.

Mayawati: బౌద్ధ విహారాల గురించి బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎస్పీ నేత మౌర్యకు మాయావతి కౌంటర్

mayawati

Swamy Prasad Maurya: బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్‌తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారంటూ సమాజ్‭వాదీ పార్టీ నేత స్వామిప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మౌర్యకు ఇలాంటివి ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించిన ఆమె.. ఎన్నికల ముందు మతపరమైన వివాదాల్ని సృష్టించి రాజకీయంగా లబ్ది పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Narsapuram-Dharmavaram Train: నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..

మౌర్య వ్యాఖ్యలపై ఆమె ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్‌తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివాదాలకు తావిస్తోంది. మౌర్య చాలా కాలం పాటు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఈ విషయంలో పార్టీపై, ప్రభుత్వంపై ఎందుకు అంత ఒత్తిడి తీసుకురాలేదు? మరి ఇప్పుడు ఎన్నికల వేళ ఇంత మత వివాదాన్ని సృష్టిస్తున్న ఆయన తీరు, సమాజ్‭వాదీ పార్టీ జుగుప్సాకరమైన రాజకీయానికి నిదర్శనం కాకపోతే మరి ఏంటి? బౌద్ధ, ముస్లిం సమాజాలు ఇలాంటి వారి వల్ల తప్పుదారి పట్టవు’’ అని అన్నారు.