Narsapuram-Dharmavaram Train: నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..

నర్సాపూర్ - ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు.

Narsapuram-Dharmavaram Train: నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..

Narsapuram-Dharmavaram Train

Updated On : July 30, 2023 / 11:36 AM IST

Train Accident Missed: నర్సాపూర్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్  రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై  గుర్తు తెలియని దుండగులు రైలు పట్టా ముక్కను అడ్డుగా పెట్టారు. ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో రైలు పట్టా పక్కకు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆదివారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లా కావలి – బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Trains Coming Opposite Same Track : హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో.. ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ ట్రైన్స్

కావలి – బిట్రగుంట మధ్య ఎగువ మార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్ పై అడ్డుగా పెట్టారు. అదే మార్గంలో నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఆ పట్టా ముక్కను రైలు ఢీకొట్టింది.ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో పట్టా ముక్క ట్రాక్ పై నుంచి పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై అడ్డుగా పట్టా ముక్కను ఎవరు పెట్టి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇటీవల రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రైలు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి తరుణంలో రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టా ముక్కను అడ్డుగా పెట్టడం కలకలం సృష్టిస్తోంది.