Udhayanidhi Stalin: మరి మీ కుమారుడు ఎన్ని పరుగులు చేశాడు అమిత్ షా?: ఉదయనిధి స్టాలిన్
" నేను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేను అయ్యాను. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను " అని ఉదయనిధి అన్నారు.

Udhayanidhi Stalin
Udhayanidhi Stalin – Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తమిళనాడు (Tamil Nadu) క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. అమిత్ షా కుమారుడు బీసీసీఐ (BCCI) కార్యదర్శి పదవిలో ఉండడాన్ని ప్రశ్నించారు.
తమిళనాడు అధికార డీఎంకే పార్టీని రాజవంశానికి చెందిన పార్టీగా తాజాగా అమిత్ షా విమర్శించారు. మాజీ సీఎం కరుణానిధి కుమారుడు, ప్రస్తుత సీఎం స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మంత్రి అయ్యారు. దీనిపైనే అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై చెన్నైలో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
” నేను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేను అయ్యాను. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. డీఎంకే నేతల లక్ష్యం నన్ను ముఖ్యమంత్రిని చేయడమేనని అమిత్ షా అన్నారు. నేను అమిత్ షాను ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మీ కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు? ఆయన ఎన్ని క్రికెట్ మ్యాచులు ఆడారు? ఎన్ని పరుగులు చేశారు? ” అని నిలదీశారు.
Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు