Congress candidate dies : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కరోనాతో మృతి

Congress candidate dies : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాధవ రావు కరోనా వైరస్ తో మరణించారు.గత నెలలో  కరోనావైరస్ బారిన పడిన మాధవరావు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఆదివారం ఏప్రిల్ 11న కన్నుమూశారు.

తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పీఎస్ డబ్ల్యూ మాధవ రావు (63) ఆయన పోటీ చేశారు. తమిళనాడులోని 234 నియోజక వర్గాలకు ఏప్రిల్ 6 వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత మాధవరావు మరణించారు. ఓట్ల లెక్కింపులో ఒక వేళ మాధవరావు గెలుపొందితే ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది.

మాధవరావు మరణంపై తమిళనాడు, పుదుచ్చేరిల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌దత్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘కోవిడ్‌ కారణంగా మాధవరావు మృతి చెందడం విచారకరం, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. మాధవరావు ఆత్మ ప్రశాంతంగా ఉండాని ప్రార్థిస్తున్నా’ అని ఆయన  ట్విటర్‌లో  సంతాపం తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు