బీజేపీతో పొత్తు.. టీడీపీ నేతల కీలక వ్యాఖ్యలు

ఈలోపు పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ నిమగ్నం అవనున్నారు. ఈ నెల 17న పర్చూరులో రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.

Tdp Janasena Bjp Alliance

BJP TDP Alliance : బీజేపీతో పొత్తుల అంశంపై టీడీపీ శ్రేణులు కీలక వ్యాఖ్యలు చేశాయి. బీజేపీతో పొత్తులపై ఇప్పుడే క్లారిటీ రాదంటున్నారు వారు. కమలం పార్టీతో పొత్తుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు బీజేపీ జాతీయ నాయకత్వం బిజీగా ఉండనుంది. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరపనున్నారు.

ఈలోపు పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ నిమగ్నం అవనున్నారు. ఈ నెల 17న పర్చూరులో రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఇక, పార్టీలో చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చంద్రబాబు. అటు, బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం గత వారం రోజుల నుంచి
వేచి చూశారు పవన్ కల్యాణ్.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరికొంత కాలం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. వారి జాతీయ నాయకత్వం మొత్తం ఈ సమావేశాల్లో బిజీగా ఉంటారు. కాబట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో వారు చర్చలు జరపడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోసారి ఢిల్లీ నుంచి కబురు వస్తుందని చంద్రబాబు, పవన్ నాలుగైదు రోజులుగా ఎదురుచూశారు. చంద్రబాబు, పవన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే, చర్చలకు కొంత సమయం పడుతుందని బీజేపీ సమాచారం ఇవ్వడంతో.. చంద్రబాబు, పవన్ తమ కార్యక్రమాల్లో పడ్డారు. పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన పెట్టుకున్నారు.

హెలికాప్టర్ ప్రాబ్లమ్ వల్ల మార్చుకున్నారు. అటు చంద్రబాబు కూడా పార్టీ నేతలతో నిరంతరం సమావేశం అవుతున్నారు. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో వారిద్దరూ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. చర్చల తర్వాత రాష్ట్ర నాయకత్వానికి చర్చల బాధ్యతను బీజేపీ పెద్దలు అప్పగిస్తారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ తో చర్చల అనంతరం బీజేపీ ఒక టీమ్ ను ఏర్పాటు చేయనుంది. ఆ టీమ్.. చంద్రబాబు, పవన్ తో చర్చలు జరపనుంది. ఆ తర్వాతే సీట్ల కేటాయింపుపై క్లారిటీ రానుంది. ఇదంతా అవ్వాలంటే నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కానీ మొదటి జాబితాను సిద్ధం చేసే అవకాశం కనిపించడం లేదు.

Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై చంద్రబాబు కామెంట్స్..
* రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు
* వైసీపీ ముఖ్య నేతలు పార్టీలోకి టచ్ లోకి వస్తున్న మాట నిజమే
* వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేము
* అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయి
* పొత్తులు, చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగదు