రఘురామ కృష్ణ రాజుకు టీడీపీ టికెట్? చంద్రబాబు కసరత్తు..

ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.

Raghu Rama Krishna Raju : ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు ఒక సీటు, బీజేపీతో మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంట్ పరిధిలో సీటు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. అనపర్తికి బదులు బీజేపీకి మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కూటమి నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఇవాళ లేదా రేపు తుది నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.

చంద్రబాబు ఆఖరి నిమిషంలో రెండు సీట్ల విషయంలో బీజేపీతో సర్దుబాట్లపై దృష్టి పెట్టారు. అనపర్తి సీటును స్థానిక టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, తానే పోటీ చేస్తానని పట్టుబట్టారు. బీజేపీకి అక్కడ సహకరించడం కూడా లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి కూడా ఆ సీటును మార్చడానికి ఒప్పుకున్నారు.

దానికి మ్యూచువల్ గా ఏలూరు పార్లమెంటులో ఒక స్థానాన్ని వారు బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని మరోసారి అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే, ఆయన కూడా సీటు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. చంద్రబాబు వారితోనూ మాట్లాడారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు రామరాజుకి అప్పగించే విధంగా, ప్రస్తుతం అక్కడ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మికి పొలిట్ బ్యూరోలో తీసుకుని పార్టీ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు వారికి సందేశాన్ని పంపారు. ఉండిలో ఆర్ఆర్ఆర్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అనపర్తి స్థానానికి బదులు ఏలూరు పార్లమెంటులో ఒక స్థానం కావాలని బీజేపీ అధిష్టాన వర్గం కోరుతోంది.

Also Read : సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్.. కోర్టుకు తరలింపు

ట్రెండింగ్ వార్తలు