Telangana Cabinet Decisions : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది.

Telangana Cabinet Decisions : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై న్యాయ విచారణకు విచారణ కమిటీ నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ పినాకిని చంద్ర బోస్ ను విచారణ కమిటీ చైర్మన్ గా నియమించారు. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇక విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది. రాబోయే రెండు రోజుల్లో రైతుబంధు నిధులను 93శాతానికి పైగా పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు..
* కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్
* మహిళా సంఘాలకు ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
* హౌసింగ్‌ కార్పొరేషన్‌ పునరుద్దరణ
* ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
* కాళేశ్వరం అవకతవకలపై కమిటీ

* సుప్రీంకోర్టు జడ్జి ఛైర్మన్ గా కమిటీ ఏర్పాటు
* 100 రోజుల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ
* భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి పవర్‌ ప్లాంట్లపై రిటైర్డ్ జడ్జితో విచారణ
* బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు
* మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం
* ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు విడుదల
* రాబోయే 2 రోజుల్లో 93శాతానికి పైగా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం

* ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం
* పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లు
* 22,500 కోట్ల రూపాయలతో 4లక్షల 50వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం
* 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం
* మహిళా సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయింపు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
* గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ
* వంద రోజుల్లో ఇరిగేషన్ పై విచారణ జరిపించాలని నిర్ణయం

మంత్రి పొంగులేటి కామెంట్స్..
కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అభయహస్తంలోని 6 గ్యారంటీలలో భాగంగా అన్నీ అమలు చేస్తాం. తెల్ల రేషన్ కార్డులపై మంత్రివర్గంలో చర్చించాం. త్వరలోనే వాటిని జారీ చేస్తాం. కులాల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము.

 

Also Read : కావాలనే అలా కూర్చున్నా, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు- ప్రతిపక్షాల ట్రోల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి రిప్లయ్

ట్రెండింగ్ వార్తలు