CM Revanth Reddy Meets Sonia Gandhi
CM Revanth Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాగాంధీని కలిసినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచే పోటీ చేయాలని గట్టిగా కోరామన్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళామని ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో 15కోట్ల జీరో టికెట్లు రికార్డ్ అయినట్లు సోనియా గాంధీకి తెలిపామన్నారు.
Also Read : టీజీగా టీఎస్ మార్పు.. రూ.500కు గ్యాస్ సిలిండర్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నట్లు వివరించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 కే గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ అమలు చేయనున్నట్లు సోనియాకు తెలిపామన్నారు. ఇక, రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి చెప్పామన్నారు. గ్యారెంటీల అమలుపై సోనియాగాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు