మరో కొత్త స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..! అదేంటో తెలుసా

ఓవైపు సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి.. పరిపాలనపై పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా పాలిటిక్స్‌కు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. గులాబీ ఎమ్మెల్యేల ఆకర్ష్‌ స్కీమ్‌ అంశం తెరపైకి వచ్చింది.

CM Revanth Reddy New Scheme (Photo : Google)

CM Revanth Reddy : తెలంగాణలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌ 6 స్కీమ్‌లు ప్రకటించింది. అందులో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే, ఆ రెండూ కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి మరో స్కీమ్‌ కూడా ప్రారంభించారన్న చర్చ నడుస్తోంది. అదే ‘రేవంత్‌ ఆకర్ష్‌’. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా.. ఈ స్కీమ్‌ స్టార్ట్‌ చేశారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరందుకుంది. రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వరుస భేటీలు.. ఈ చర్చను మరింత పీక్‌ స్టేజ్‌కి తీసుకెళ్లాయి.

బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా పాలిటిక్స్‌కు పదును..
పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకొని తమ పట్టు నిలుపుకోవడానికి రెండు పార్టీలు తాపత్రయపడుతున్నాయి. ఓవైపు సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి.. పరిపాలనపై పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా పాలిటిక్స్‌కు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. గులాబీ ఎమ్మెల్యేల ఆకర్ష్‌ స్కీమ్‌ అంశం తెరపైకి వచ్చింది.

Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!

సీఎంతో వరుసగా భేటీలు.. గులాబీ పార్టీలో గుబులు
ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డితో మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గులాబీ బాస్‌ కేసీఆర్‌ సొంత జిల్లాతో పాటు ఆయనకు నమ్మకస్తులుగా పేరున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు.. రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. తాజాగా.. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా ముఖ్యమంత్రితో ఆయన ఇంటి దగ్గర భేటీ అయ్యారు.

ఈ మధ్యలోనే బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఈ లిస్టులో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంకా కొందరు నేతలున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ వరుస భేటీలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. అయితే.. ఈ భేటీల వెనక రేవంత్‌ మార్క్‌ స్కీమ్‌ ఉందన్న చర్చ సాగుతోంది.

ఆర్నెళ్లలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందంటూ ప్రచారం..
ఆర్నెళ్లలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందంటూ బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారానికి విరుగుడుగా.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల మీటింగ్‌కు తెరలేపారన్న
బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ఇంటి దగ్గరే కలిశారు. ఆ తర్వాత నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అయ్యామంటూ ప్రకటనలు చేశారు. ఇదంతా చూస్తుంటే గతంలో కేసీఆర్‌.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా చేసిన రాజకీయం గుర్తుకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్నెళ్లలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందంటూ బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారానికి విరుగుడుగా.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల మీటింగ్‌కు తెరలేపారన్న చర్చ నడుస్తోంది.

బీఆర్‌ఎస్‌లో చీలిక తెచ్చేందుకు..
తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. తనతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో కేసీఆర్‌కు తెలిసేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది. తద్వారా రేవంత్‌రెడ్డి ఎంత అప్రమత్తంగా ఉన్నారో చెబుతూనే.. బీఆర్‌ఎస్‌లో చీలిక తెచ్చేందుకు ఏ రేంజ్‌కైనా వెళ్తానని నేరుగా కేసీఆర్‌కు సంకేతాలు ఇచ్చినట్లేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!

ఇప్పటికే పాలనలో తనదైన మార్కు వేస్తున్న రేవంత్‌రెడ్డి.. రాజకీయ ఎత్తుగడల్లోనూ.. కేసీఆర్‌కు తక్కువేం కాదనే విధంగా ముందుకు వెళ్తున్నారు. గతంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ను దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌పై.. ఇప్పుడు అదే ఫార్ములాను సంధిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.