జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీకి : టికెట్ టెన్షన్

పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఢోకా లేదని అనుచరులు అనునయిస్తున్నా...

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 04:05 PM IST
జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీకి : టికెట్ టెన్షన్

పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఢోకా లేదని అనుచరులు అనునయిస్తున్నా…

పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఢోకా లేదని అనుచరులు అనునయిస్తున్నా… వ్యతిరేకులు మాత్రం టికెట్ రాకుండా పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ… టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందెవరు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరికి తప్ప మిగతా సిట్టింగ్ లకు సీటు గ్యారెంటీ అనే ప్రచారం ఉంది. అయితే.. ఆ కొందరు ఎవరు అనే ప్రశ్న టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో… జహీరాబాద్ సిట్టింగ్ అభ్యర్థి మార్పుపైనా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ 2014లో జహీబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి లక్షా 45వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పారిశ్రామికవేత్త అయిన బీబీ పాటిల్‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఒకరిద్దరు మినహా… ఎక్కువ శాతం మంది నేతలతో సత్సంబంధాలు లేవని పార్టీ శ్రేణులంటున్నాయి. మరోవైపు… జహీరాబాద్ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని.. టికెట్ కోసం అధిష్టానం దగ్గర సీరియస్‌గా ట్రై చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ సీనియర్ నేత… బీబీ పాటిల్‌కు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారనే గుసగుసలు టీఆర్ఎస్‌లో వినిపిస్తున్నాయి.

జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌‍ను కాదని టీపీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ పేరును పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకే దాదాపుగా టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో… బలమైన అభ్యర్థినే బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇటీవలే సీఎం కేసీఆర్‌ను బీబీ పాటిల్ కలిశారు. టికెట్‌పై హామీ ఇచ్చిట్లు పార్టీ నేతలంటున్నారు. అయితే… పార్టీ సన్నాహక సమావేశం జరిగి… కార్యకర్తల అభిప్రాయాలను వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాకే అభ్యర్థి పేరు ఖరారు చేస్తారని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో… జహీరాబాద్ టికెట్‌పై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.