YS Sharmila: నన్ను ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్ నేతలకు లేదు: షర్మిల

వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.

YS Sharmila: టీఆర్ఎస్ నేతలకు, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనను ఎదుర్కొనే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు వైఎస్ షర్మిల.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

బుధవారం ఆమె 10 టీవీతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ షర్మిల తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై టీఆర్ఎస్ నేతలు చిన్నపిల్లల్లా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని షర్మిల విమర్శించారు. ‘‘ఎవరికి ఫిర్యాదు చేసినా భయపడేది లేదు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ నేతలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని షర్మిల అన్నారు.

BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్

అంతకుముందు కూడా ఈ అంశంపై మాట్లాడారు. తనపై స్పీకర్ చర్యలు తీసుకునే ముందు ఒక తల్లిని అవమానించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను మరదలు అంటూ కించపరిచేలా, తోటి మహిళలను అవమానించేలా మాట్లాడిన నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తనను అవమానించిన వ్యక్తిని తాను ఎందుకు ప్రశ్నించొద్దని, ఇదెక్కడి న్యాయం అని షర్మిల సోషల్ మీడియా పోస్ట్ ద్వారా నిలదీశారు.

 

ట్రెండింగ్ వార్తలు