Communal violence ahead of GHMC elections : తెలంగాణలో ఘర్షణలు స్పష్టించాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపేందుకు కుట్ర జరుగుతోందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడో చోట గొడవలు సృష్టించి మతం రంగు పూయాలని చూస్తున్నారని చెప్పారు.ఎన్నికలు వాయిదా వేసేలా కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు.. ఫొటోలు మార్ఫింగ్ చేశారని అన్నారు. సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనివ్వమని అన్నారు. ఎవరైనా రెచ్చగొడితే యువకులు రెచ్చిపోవద్దని కేసీఆర్ సూచించారు. కుట్రకు సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు.