పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి సీరియస్

  • Publish Date - January 12, 2020 / 11:05 AM IST

ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ  పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరిపి నివేదిక  ఇవ్వాలని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని ఆయన ఆదేశించారు.  సీఎం జగన్ దృష్టికి వెళ్ళిందని ఆయన ఆదేశాల మేరకు ఏ చర్యలైనా ఉంటాయని టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
  
విచారణలో పృధ్వీ తప్పు చేసినట్లు తేలితే  చర్యలు తప్పవని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఆడియో టేపుల వ్యవహారం పై ఇప్పటికే విచారణకు ఆదేశించామని  నివేదిక వచ్చిన తర్వాత సీఎం కు చెప్పి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని  ఆయన చెప్పారు. ఈ విషయమై సుబ్బారెడ్డి పృధ్వీని ఫోన్లో వివరణ కోరగా….   అది తన వాయిస్ కాదని ..ఒక వర్గం కావాలని తననవు టార్గెట్ చేసి  మార్ఫింగ్ చేసి వాయిస్ సృష్టించారని అది తన వాయిస్ కాదని చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే పృధ్వీ సమాధానం పట్ల వైవీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రంలోగా  విచారణ జరిపి  నివేదిక ఇవ్వమని వైవీ  చెప్పటంతో ఈ విషయమై  చైర్మన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం అవుతోంది. ఒక సీఐ తో సహా నలుగురు కానిస్టేబుళ్లు ఎస్వీబీసీ ఛానల్ లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.