Vanakkam Modi: ‘గో బ్యాక్ మోదీ’కి ‘వనక్కం మోదీ’ అంటూ గట్టి కౌంటర్ అటాక్ చేసిన బీజేపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.

Vanakkam Modi: తమిళనాడు (Tamilnadu)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi)కి నిరసన ఎదురవడం కొత్తేం కాదు. ఆయన ఎప్పుడు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా.. రోడ్ల మీద మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపిస్తాయి. అలాగే సోషల్ మీడియా (Social Media)లో ‘గో బ్యాక్ మోదీ’ అనే ట్రెండ్ సర్వసాధారణం అయిపోయింది. తాజాగా చెన్నై విమానాశ్రయంలోని న్యూ ఇంటిగ్రేడెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రోజున తమిళనాడుకు మోదీ వెళ్లనున్నారు. అంతే, ఇప్పటి నుంచే నెటిజెన్లు ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు.

Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా

అయితే విపక్షాలు చేస్తున్న ఈ హడావిడికి బీజేపీ ఘట్టి ప్రతిఘటనే ఇచ్చింది. ‘వనక్కం మోదీ’ అంటూ ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో వనక్కం మోదీ (#Vanakkam_Modi) అనే హ్యాష్‭ట్యాగ్ ప్రస్తుతం హైలైట్ అవుతోంది. ఈ హ్యాష్‭ట్యాగ్ ఉపయోగించి మోదీ గతంలో చేసిన అభవృద్ధి పనులను ప్రస్తావించడమే కాకుండా, ప్రస్తుత అభివృద్ధి పనులపై కూడా ట్వీట్లు వేస్తున్నారు. ఒకవైపు ‘గో బ్యాక్ మోదీ’ అనేది ఎంతగా ట్రెండ్ అవుతుందో, దానికి వనక్కం మోదీ అంతకంటే ఎక్కువే ట్రెండ్ అవుతోంది. అయితే మోదీ వ్యతిరేక క్యాంపెయిన్ కు ఇంత పెద్ద ఎత్తున బీజేపీ కౌంటర్ అటాక్ చేయడం ఇదే మొదటిసారి.

Karnataka Polls: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కిచ్చా సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలట.. కోర్టులో పిటిషన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్, వివేకానంద హౌస్, రాజ్‌భవన్, ఐఎన్ఎస్ అడయార్ హెలిపాడ్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన సెక్యూరిటీని ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇక దీని అనంతరం.. చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి మోదీ ప్రారంభించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు