Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా

ఇతర దేశాల అధినేతలు ప్రధానిని కౌగిలించుకుంటే ఒక్కో కౌగిలికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎన్ని పేపర్లలో సంతకాలు చేస్తారో తెలియదు. కారణం, ప్రధానికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ చదువుకున్నారు. నేడు దేశ యువత ఆకాంక్షలు వేరేలా ఉన్నాయి. వారు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు.

Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా

Manish Sisodia (file photo)

Manish Sisodia: కొద్ది రోజులుగా మోదీ డిగ్రీ గురంచి హడావుడి చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజాగా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఈసారి ఎక్కువ చదువును తక్కువ చదువుతో పోలుస్తూ తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ‘‘ఒక చిన్న కంపెనీ ఉంటే.. దానికి విద్యావంతుడైన మేనేజర్‌ని వెతుక్కుంటాం. మరి దేశానికి ఎన్నికయ్యే పెద్ద మేనేజర్ విద్యావంతుడు కానవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. పైగా ఈ లేఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే రాయడం గమనార్హం.

Kiran kumar Reddy : అందుకే బీజేపీలో చేరా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

సిసిడోడియా హిందీలో రాసిన లేఖ..

‘‘నేడు మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రోజురోజుకూ కొత్త పురోగమనం చోటు చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. ఇటువంటి పరిస్థితిలో, మురికి కాలువలోకి పైపులు వేసిన గ్యాస్‌తో టీ లేదా ఆహారం తయారు చేయవచ్చని ప్రధాని చెప్పడం వింటే నా గుండె ఆందోళన చెందుతోంది. మురికి కాలువ నుంచి వచ్చే మురికి వాయువుతో మనం ఆహారాన్ని ఉడికించగలమా? లేదు!

మేఘాల వెనుక ఎగురుతున్న విమానాన్ని రాడార్ పట్టుకోలేదని ప్రధాని చెప్పినప్పుడు, ఆయన ప్రపంచం ముందు నవ్వులపాలు అయ్యారు. స్కూళ్లు, కాలేజీల్లో చదివే పిల్లలు కూడా ఇలాంటి వాటిపై ఎగతాళి చేస్తుంటారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు దేశానికి అత్యంత ప్రమాదకరం. దీనికి అనేక ప్రతికూలతలు ఉన్నాయి. భారతదేశ ప్రధానమంత్రి ఎంత తక్కువ విద్యావంతుడో, ఆయనకు సైన్స్ గురించి ప్రాథమిక జ్ఞానం కూడా లేదని ప్రపంచం మొత్తానికి తెలిసింది.

Andhra Pradesh : నంద్యాల ఎమ్మెల్యే బరిలో నేను కూడా ఉండబోతున్నా : భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

ఇతర దేశాల అధినేతలు ప్రధానిని కౌగిలించుకుంటే ఒక్కో కౌగిలికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎన్ని పేపర్లలో సంతకాలు చేస్తారో తెలియదు. కారణం, ప్రధానికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ చదువుకున్నారు. నేడు దేశ యువత ఆకాంక్షలు వేరేలా ఉన్నాయి. వారు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నారు. మరి అంతగా చదువుకోని ప్రధానికి నేటి యువత కలలు సాకారం చేసే సత్తా ఉందా?

ఇటీవలి సంవత్సరాలలో, దేశంలో 60 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఎందుకు? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరగాలి. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడాలి. అలా జరిగితే ఢిల్లీ ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పంపినట్లే.. దేశమంతా జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి. ఇది దేశానికి ప్రమాద ఘంటిక. విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యత లేదని దీన్నిబట్టి తెలుస్తోంది. మన పిల్లలకు మంచి చదువులు చెప్పకపోతే భారతదేశం పురోగమిస్తుందా?

Karnataka Polls: జేడీఎస్-ఎంఐఎం మధ్య చర్చలు.. సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ న్యూసే!

తాను చదువుకోలేదని గర్వంగా చెబుతున్న ప్రధాని వీడియో చూశాను. ఆయన గ్రామంలోని పాఠశాల వరకు మాత్రమే చదువుకున్నారు. నిరక్షరాస్యులు లేదా తక్కువ విద్యావంతులు కావడం గర్వకారణమా? తక్కువ చదువుకున్నవాడినని ప్రధానమంత్రి గొప్పగా చెప్పుకునే దేశంలో, సామాన్యుడి బిడ్డకు మంచి చదువు ఎప్పటికీ అందదు. ఇటీవలి కాలంలో 60 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం ఇందుకు సజీవ నిదర్శనం. అటువంటి పరిస్థితిలో నా భారతదేశం ఎలా పురోగమిస్తుంది? మీకు ఒక చిన్న కంపెనీ ఉంటే.. దానికి విద్యావంతుడైన మేనేజర్‌ని వెతుక్కుంటారు. మరి ఈ దేశానికి ఎన్నికయ్యే పెద్ద మేనేజర్ విద్యావంతుడు కానవసరం లేదా?’’ అని సిసోడియా రాసుకొచ్చారు.