Karnataka Polls: జేడీఎస్-ఎంఐఎం మధ్య చర్చలు.. సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ న్యూసే!

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట్లను ప్రభావితం చేయగలదు

Karnataka Polls: జేడీఎస్-ఎంఐఎం మధ్య చర్చలు.. సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ న్యూసే!

HD Kumaraswamy and Asaduddin Owaisi.

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాస్త అనుకూల వాతావరణమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే చెప్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీవైపుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మిగిలిన వర్గాల నుంచి ఉన్న ఓట్లకు ఇవి కూడా కలిస్తే విజయం సునాయసం అవుతుంది.

Kiran kumar Reddy : అందుకే బీజేపీలో చేరా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ సైతం ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపుకు తిప్పుకునేందుకు స్ట్రాటజీలు కూడా చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆశల మీద నీళ్లు పడనున్నాయా అనే వాతావరణం కనిపిస్తోంది. కారణం.. రాష్ట్రంలో కీలకమైన పార్టీలో ఒకటైన జనతాదళ్ సెక్యూలర్ పార్టీతో ఏఐఎంఐఎం పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సానుకూలంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టే. రాష్ట్రంలోని ముస్లిం ఓట్లు ఈ కూటమికి పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా జేడీఎస్ బలంగా ఉండే మైసూర్ ప్రాంతంలో ఇది కాంగ్రెస్ పార్టీని చాలా వరకు దెబ్బ తీస్తుంది.

Amritpal Singh: అమృత్‌పాల్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఏప్రిల్ 14వరకు సెలవులు రద్దు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట్లను ప్రభావితం చేయగలదు. అయితే ఎంఐఎంతో పొత్తుతో ముస్లిం ఓట్లు జేడీఎస్ వైపుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సీట్ల పంపకాల్లో చేటు చేస్తుందని అంటున్నారు.

Etela Rajender: పోలీసులిచ్చిన నోటీసులపై ఈటల స్పందన .. కేసీఆర్‌పై ఘాటు విమర్శలు

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.