Etela Rajender: పోలీసులిచ్చిన నోటీసులపై ఈటల స్పందన .. కేసీఆర్‌పై ఘాటు విమర్శలు
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Eatala Rajender
Etela Rajender: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ (Tenth Paper Leak) ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) కు వరంగల్ కమిషనరేట్ (Warangal Commissionerate) పోలీసులు నోటీసులిచ్చిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం హాజరు కావాలని ఆ నోటీసులో సూచించారు. అయితే, 10న హాజరవుతానని ఈటల చెప్పారు. తాజాగా బీఆర్ఎస్ కార్యాలయంలో ఈటల రాజేందర్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మాట్లాడారు. నేను టెక్నాలజీకి అప్ డేట్ కాలేదు. మేసేజ్‌లకు రిప్లై ఇవ్వనని అన్నారు. ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే అది చూడకపోయినా నాకు నోటీసులు ఇచ్చారన్నారు. వేధించడానికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు, జైళ్లకు భయపడమని అన్నారు. అసలు సంబంధమేలేని విషయానికి నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నానని ఈటల అన్నారు.
చట్టం మీద నాకు గౌరవం ఉంది, నోటీసులపై వివరణ ఇస్తానని ఈటల చెప్పారు. సీఎం కేసీఆర్‌కు పోయేకాలం వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదని స్పష్టం చేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక కేసీఆర్ కుటుంబానికి బండి వార్నింగ్
సింగరేణిపై ఈటల మాట్లాడుతూ ..
సింగరేణి విషయంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎందుకు 10వేల కోట్లు అప్పుల పాలైంది? తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని అన్నారు. సింగరేణి పెరిగిందా? తగ్గిందా?. 55 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెరిగిందని, కానీ, ఉద్యోగులు మాత్రం తగ్గారని అన్నారు.
90శాతం పనులు ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారని, కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి తొమ్మిది వందలకుపైగా ఇస్తున్నారని, సింగరేణి కార్మికుడిని 430 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, తద్వారా శ్రమదోపిడీ చేస్తున్నారని ఈటల విమర్శించారు. సింగరేణి కంపెనీని ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని, దాని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఈటల విమర్శించారు.