Karnataka Polls: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కిచ్చా సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలట.. కోర్టులో పిటిషన్

మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ ప్రముఖుడు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్.. తాను బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేశారు

Karnataka Polls: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కిచ్చా సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలట.. కోర్టులో పిటిషన్

kiccha sudeep

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన కిచ్చా సుదీప్ సినిమాలను, షోలను బ్యాన్ చేయాలని రాష్ట్రంలోని శివమొగ్గకు చెందిన ఒక లాయర్ శుక్రవారం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ బ్యాన్ పూర్తిగా కాదట. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు బ్యాన్ చేయాలని ఆయన తన పిటిషన్‭లో పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆయన సినిమాలు కానీ, షోలు కానీ ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయని, అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు వాటిని టెలికాస్ట్ కాకుండా అడ్డుకోవాలని కేపీ శ్రీపాల్ అనే లాయర్ వాదిస్తున్నారు.

Amit Shah: దేశంలో ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కాదు.. ఏం ప్రమాదంలో పడిందో తెలుసా?: అమిత్ షా

ఎన్నికల నియమావళి ప్రక్రియ కింద ఈ నిర్ణయం తీసుకోవాలని కోర్టును శ్రీపాల్ కోరారు. కర్ణాటకలో చారిత్రాత్మక విజయం సాధించాలనే తపనతో అధికార బీజేపీ.. ప్రచారంలో సినీ ముఖాలను తీసుకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ ప్రముఖుడు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్.. తాను బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బొమ్మై కోసమే ఒప్పకున్నానని, వాస్తవానికి ఆయన కోసం ఏమైనా చేస్తానని ప్రకటించారు.

Go Back Modi: తమిళనాడులో మోదీకి మరోసారి నిరసన సెగ.. ‘గో బ్యాక్’ అంటూ తమిళుల నినాదాలు

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.