Amit Shah: దేశంలో ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కాదు.. ఏం ప్రమాదంలో పడిందో తెలుసా?: అమిత్ షా

విపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదని అన్నారు.

Amit Shah: దేశంలో ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కాదు.. ఏం ప్రమాదంలో పడిందో తెలుసా?: అమిత్ షా

Amit Shah

Amit Shah: ఎన్డీఏ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిదంటూ విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు. ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కౌశాంబిలో ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ విపక్షాలపై మండిపడ్డారు.

“ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారు (కాంగ్రెస్ నేతలు) అంటున్నారు. నిజానికి మా పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు. కులతత్వం, వారసత్వ రాజకీయాలు, ఒక కుటుంబ ఏకఛత్రాధిపత్యం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి” అని అమిత్ షా చెప్పుకొచ్చారు. తమ పాలన కులతత్వం, వారసత్వ రాజకీయాలు, ఒక కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా కొనసాగుతోందని తెలిపారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు పడిన విషయంపై అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ శ్రేణులు, ఇతర విపక్ష నేతలు చేస్తోన్న ఆందోళన పట్ల మండిపడ్డారు. “ఈ ప్రతిపక్ష పార్టీలను దేశం క్షమించదు. రాహుల్ గాంధీపై వేటు పడినందుకు పార్లమెంటులో సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నాయి” అని అమిత్ షా అన్నారు.

“నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్ లో బాంబు పేలుడు జరిగింది. ఆ కేసులో నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాంబు పేలుడు వెనుక సూత్రధారి ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లో దొరికాడు. గత ప్రభుత్వ హయాంలో ఆజంగఢ్ ప్రతిష్ఠ దెబ్బతింది” అని అమిత్ షా చెప్పారు.

Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా