జగన్.. మీ నాన్న ఇచ్చిన జీవో చూడు…..విశాఖ స్వామి స్వరూపానందేంద్ర

తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం ప్రకటనలు ముద్రించటం దుర్మార్గపు చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై స్పందించిన స్వామి... హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నామన్నారు.

  • Publish Date - August 23, 2019 / 12:08 PM IST

తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం ప్రకటనలు ముద్రించటం దుర్మార్గపు చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై స్పందించిన స్వామి… హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నామన్నారు.

విశాఖపట్నం: తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం ప్రకటనలు ముద్రించటం దుర్మార్గపు చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై స్పందించిన స్వామి… హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఖండిస్తున్నామన్నారు.

బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వమే నిగ్గు తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జీవో జారీ చేసిన విషయాన్ని స్వామి గుర్తు చేశారు.

వైఎస్సార్ జారీ చేసిన జీవోను సీఎం జగన్ తక్షణమే సమీక్షించాలన్నారు. హిందువుల మనో భావాలు దెబ్బతీసే ఎటువంటి చర్యలను ఉపేక్షించ వద్దని ఆయన సీఎం ను కోరారు.బుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి వారు ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు.