Telangana BJP New President : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఎన్నిక.. అధ్యక్ష రేసులో కీలక నేతలు..!

అధ్యక్ష పదవి వద్దంటూనే దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ఇక, కొత్తగా తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు వచ్చినట్లు సమాచారం.

Telangana BJP New President : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు ఉంటుంది అనేదానిపై బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ కీలక నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేతలు వ్యవహరించిన తీరుపై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారట. ఇద్దరు ముగ్గురు అగ్రనేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పుకుంటున్నారు. అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అధ్యక్ష పదవి వద్దంటూనే దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ఇక, కొత్తగా తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు వచ్చినట్లు సమాచారం.

Also Read : మీర్‌పేట్ మాధవి కేసులో భారీ ట్విస్ట్.. ఇంతకాలం గురుమూర్తి ఒక్కడే అనుకున్నారు.. కానీ..

తలనొప్పిగా మారిన పార్టీ చీఫ్ ఎన్నిక..
ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. పార్టీ చీఫ్ ఎవరు అనేదానిపై కొంత ఏకాభిప్రాయం వచ్చింది. కానీ, తెలంగాణ విషయంలో మాత్రం స్టేట్ పార్టీ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనేది బీజేపీ అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీ నేతల తీరుతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

అధ్యక్ష రేసులో కీలక నేతలు..
బీజేపీ చీఫ్ రేసులో ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరితో పాటు బండి సంజయ్ పేరు కూడా కీలకంగా వినిపిస్తోంది. అయితే, నేను ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నాను, నాకు అధ్యక్ష పదవి వద్దు, ఒకరికి రెండు పదవులు సాధ్యం కావని, రెండు పదవులను బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదని ఇంటర్నల్ గా సన్నిహితులతో చెబుతున్నారు.

Also Read : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు వేసే డేట్‌ ఇదే..

తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు..
అయినప్పటికీ.. ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు, వ్యవహారశైలి, ప్రతిపక్ష అధికార పక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు.. ఇవన్నీ కూడా బండి సంజయ్ అధ్యక్షుడి రేసులో ఉన్నాడని చెప్పకనే చెబుతున్నాయి. ఇక, మహిళ కోటాలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పేరు కూడా తెరపైకి వచ్చింది.

అధ్యక్ష ఎన్నిక జరిగే కీలకమైన ఈ సమయంలో బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. అధ్యక్ష పదవి తమనే వరిస్తుంది అంటూ కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇవాళే ప్రకటన వస్తుందనే చర్చ కూడా సాగిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకోవడం, పార్టీ చీఫ్ పదవి తమ నేతకే వస్తుందని వాళ్ల అనుచర వర్గం ప్రచారం చేసుకోవడం.. ఈ తీరు బీజేపీ జాతీయ నాయకత్వానికి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పార్టీ చీఫ్ ఎన్నికపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రానికి రావాల్సిన ఇంఛార్జ్ శోభ కరంద్లాజే రాక ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.