Chandrababu Slams CM Jagan In Kamalapuram
Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ విజయం ఖాయం అంటున్నారు చంద్రబాబు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి.. మీకు, నాకు న్యాయం చేస్తాడా? అంటూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. కడప జిల్లా కమలాపురంలో రా కదిలిరా సభలో నిప్పులు చెరిగారు చంద్రబాబు.
రాష్ట్రంలో ఉండే మహిళల భద్రత కోసం, రైతుల బాగు కోసం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కడపలో వైసీపీకి అన్ని సీట్లు గెలిపించినా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా తీసుకురాలేదన్నారు. కమలాపురం సాక్షిగా చెబుతున్నా.. పులివెందుల లో కూడా టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులలో ప్రజలు వైసీపీని నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో కరవు వచ్చిందని, అయితే ఏ ఒక్క మండలాన్ని అయినా కరవు మండలంగా ప్రకటించారా? అని చంద్రబాబు అడిగారు. అదే నేనైతే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చి కరవు రైతులను ఆదుకునే వాడిని అని చంద్రబాబు అన్నారు.
”వివేకానంద రెడ్డి హత్య కేసులో మలుపులు మీద మలుపులు. వివేకానందరెడ్డిని దారుణంగా చంపారు. గుండె పోటుతో చనిపోయాడని అన్నారు. ఆ తర్వాత రక్తపు వాంతులు అన్నారు. పోస్టుమార్టం వద్దనుకున్నారు. ఆయన కూతురు పట్టుపడితే పోస్టుమార్టం చేశారు. నాన్న లేడు, నేడు బాబాయ్ కుడా లేడని చెప్పి ఓట్లకు వెళ్లారు. చిన్నాన్ననే లెక్క చేయని వ్యక్తికి మనం ఓ లెక్కనా? వివేకా మృతికి కారణం రెండవ పెళ్లి అన్నారు. తర్వాత బెంగుళూరు భూమి పంచాయతీ అన్నారు. సీబీఐపైనే కేసులు పెట్టారు. రేపు పోలీసులుపైనే కేసులు పెడతారు జాగ్రత్త. రేపు మిమ్మల్ని, నన్ను చంపినా ఈ రాష్ట్రంలో దిక్కు లేదు. కడప గడ్డ మీద అడుగుతున్నా జగన్ సమాధానం చెప్పాలి.
Also Read : జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఈ ప్రభుత్వం పేదవాడిని పట్టించుకోవడం లేదు. 40లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఇసుక దోచుకుంటున్నారు. నాసిరకం మద్యం ద్వారా 200 రూపాయలు జలగ మామకు పోతోంది. మందుబాబులను జగన్ మోసం చేశారు. ఎన్నికల సమయంలో మద్యపానం నిషేధిస్తామని చెప్పి, ఇప్పుడు మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. 22 మిలియన్ యూనిట్ల కరెంటు కోత ఉంటే, 5 రోజుల్లోనే కరెంట్ కొరత తీర్చాను. 200 యూనిట్ల వరకు ఆనాడు ఫ్రీ అన్నావు. నాలుగేళ్లు అవుతున్నా ఇచ్చావా? రైతుల మోటార్లకు మీటర్లు పెట్టావు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చిందా? రెండుసార్లు రిబ్బన్ కట్ చేశారు.
నేను కూడా రాయలసీమ బిడ్డే. రాయలసీమకు ఇబ్బంది లేకుండా చూస్తా. రాయలసీమకు నీళ్లు ఇచ్చింది తెలుగు ముద్దు బిడ్డ ఎన్టీఆర్. అవుకు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాను. గండికోటకు నీళ్లు తెస్తాను అన్నావు. నేను ఖర్చు పెట్టిన దానిలో 20 శాతం అయినా ఖర్చు చేశావా? కాలువలలో నీళ్లు రాలేదు. రైతుల కళ్లలో నీళ్లు వస్తున్నాయి. గోదావరి జలాలు రాయలసీమకు తేవడమే నా ధ్యేయం. రాయలసీమను రతనాల సీమ చేస్తా. నీళ్లు ఉంటే పరిశ్రమలు వస్తాయి. నిరుపేదలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పని ఉండదు. ఈ ప్రభుత్వంలో రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. ఆ నలుగురు రెడ్లు మాత్రమే. వారు పెద్దిరెడ్డి, సజ్జల, అవినాష్, సాయి రెడ్డి. వీరికి మాత్రమె ఈ ప్రభుత్వంలో లబ్ది చేకూరింది.
బీసీ అయిన నందం సుబ్బయ్యను దారుణంగా చంపారు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్లే చనిపోయింది. జలగన్న సర్వే చేశారు. మీ భూమి వేరొకరికి పోతుంది. అందుకోసం లోపభూయిష్టమైన చట్టం తెచ్చారు. భయపడితే భయమే మిమ్మల్ని చంపేస్తుంది. చెల్లికి న్యాయం చేయలేని వాడు మీకు, నాకు న్యాయం చేస్తాడా? జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ లో వస్తోంది.
Also Read : జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 ఇంటికి పంపుతా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతురాజ్యం తెస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చుతాం. వంటిమిట్ట కోదండ రామాలయాన్ని నేనే అభివృద్ధి చేశా. ఒక్క రాజధాని కట్టలేని వ్యక్తి ఇప్పుడు మూడు రాజధానులు కడతారు అట. మన రాజధాని అమరావతి.
జమ్మలమడుగు ఎమ్మెల్యే పేరుకు డాక్టర్. కానీ, వాటాల ఎమ్మెల్యే. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బెట్టింగ్ ఎమ్మెల్యే. బీసీ నేతను పొట్టన పెట్టుకున్నారు. కర్ణాటక డీజీల్ మాత్రమే అమ్మాలి. వేరే అమ్మితే కేసులు పెడతాడు. కమలాపురం ఎమ్మెల్యే లంచాల వసూలులో కింగ్. మీరు తిన్నది వడ్డీతో సహా కక్కిస్తా. గండికోట ప్రాజెక్ట్ బాధితులకు న్యాయం చేస్తాం. చేనేత కార్మికుల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం” అని చంద్రబాబు అన్నారు.