Etela Rajender
Etela Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈటలతో పాటు బీజేపీలోకి ఎవరు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు.
మరోవైపు ఈటల దారెటు అన్నది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నుంచి ఈటలకు ఆహ్వానాలు అందాయి. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు అనుచరులతో వరుసగా భేటీ అవుతున్నారు ఈటల. అయితే, బీజేపీలో చేరేందుకే ఈటల మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను తనతో పాటు తెస్తానని బీజేపీ నేతలకు ఈటల హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం.