Yogi Adityanath: ప్రధానమంత్రి పదవిపై యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నరేంద్రమోదీ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తుంటారు. యోగి మనసులో కూడా ఇదే ఉందని, సన్నిహితులతో పలుమార్లు చెప్పినట్లు కూడా పుకార్లు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా యోగినే క్లారిటీ ఇచ్చేశారు

Yogi Adityanath: నరేంద్రమోదీ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తుంటారు. యోగి మనసులో కూడా ఇదే ఉందని, సన్నిహితులతో పలుమార్లు చెప్పినట్లు కూడా పుకార్లు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా యోగినే క్లారిటీ ఇచ్చేశారు. తానెప్పుడూ ప్రధానమంత్రి కావాలని చెప్పలేదని, నిజానికి రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదని ఆయన తేల్చి పారేశారు. బుధవారం ఆయన యూపీ రాజధాని లఖ్‭నవూలో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Tripura Polls: త్రిపుర అసెంబ్లీకి రేపే పోలింగ్.. లెఫ్టు, రైటు ఫైటును త్రిముఖ పోటీకి తెచ్చిన తిప్రా మోతా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి తాను ఎక్కడికీ వెళ్లనని అన్న యోగి.. దేశానికి మోదీ బలమైన శక్తని, ప్రపంచ దేశాల్లో భారత్‭ను నాయకత్వ స్థానంలో నిలబెట్టారని పొగడ్తలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీయేనని యోగి చెప్పకనే చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పిన యోగి, 300 పైగా స్థానాలు కమల పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Supriya Sule: మోదీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ఒక్కరే పని చేస్తున్నారట!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా యోగి రికార్డు నెలకొల్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. యూపీలో ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే పూర్తిస్థాయి ప్రభుత్వాలు కొనసాగాయి. అందులో మొదటిది బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్. కాగా, ఇక వరుసగా రెండోసారి కూడా పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా యోగి పాలించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ టెర్మ్ కనుక పూర్తి చేస్తే యూపీకి అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ముఖ్యమంత్రిగా కూడా యోగి రికార్డు నెలకొల్పుతారు. ప్రస్తుతం ఈ రికార్డు మాయావతి పేరు మీద ఉంది. ఆమె ఏడు సంవత్సరాలకు పైగా యూపీ సీఎంగా పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు