Tripura Polls: త్రిపుర అసెంబ్లీకి రేపే పోలింగ్.. లెఫ్టు, రైటు ఫైటును త్రిముఖ పోటీకి తెచ్చిన తిప్రా మోతా

రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక సీపీఐ(ఎం) నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీనియర్‌ నేతలు ప్రకాశ్‌ కారత్‌, బృందా కారత్‌, మహ్మద్‌ సలీంలతో పాటు మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి తదితరులు ప్రచారం చేశారు

Tripura Polls: త్రిపుర అసెంబ్లీకి రేపే పోలింగ్.. లెఫ్టు, రైటు ఫైటును త్రిముఖ పోటీకి తెచ్చిన తిప్రా మోతా

Tripura votes tomorrow after high-voltage campaign

Tripura Polls: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలనను కూల్చి కాషాయ జెండా ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ, ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర రాష్ట్రంలో 3,328 పోలింగ్ బూతుల్లో 28.13 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు.

Ram Mandir Defaced: రామమందిరంపై ఇండియాకు మోదీకి వ్యతిరేకంగా రాతలు

ఈ ఎన్నికలు త్రిముఖ పోటీగా కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కాగా, మరొకటి సీపీఎం నేతృత్వంలోని సెక్యూలర్ డెమొక్రటిక్ అలయన్స్. వీటితో పాటు తిప్రా మోతా పార్టీ కూడా ప్రధాన పోటీదారుగానే ఉంది. బీజేపీ, సీపీఎం కూటములకు ఈ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో సీపీఎంతో చేతులు కలిపింది. బెంగాల్ రాష్ట్రంలో ముమ్మారు గెలిచిన టీఎంసీ, త్రిపుర బరిలో ఒంటరిగానే నిలిచింది. కాకపోతే సీపీఎంల్ పార్టీకి ఒక స్థానం ఇచ్చి పొత్తుకు తీసుకుంది. అయితే కేవలం 28 స్థానాల్లోనే టీఎంసీ పోటీకి దిగుతుండడం గమనార్హం.

Delhi: ప్రియురాలిని హతమార్చి ఫ్రిజ్‭లో పెట్టి, కొద్ది గంటల్లోనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు

బీజేపీ ఇండీజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీ 6 స్థానాల్లో పోలీకి దిగుతోంది. రాష్ట్రంలోని తిప్రా ఆధిపత్య ప్రాంతాలను నిర్వహించే త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్(టీటీఏడీసీ)కి 2021లో జరిగిన ఎన్నికలలో తిప్రా మోత మంచి ఫలితాలు సాధించింది. టీటీఏడీసీలోని 30 స్థానాలకు గానూ ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 60 మంది సభ్యుల శాసనసభలో 20 గిరిజనుల ఆధిపత్య స్థానాల్లో తిప్రా మోత తన ప్రభావాన్ని చూపుతుంది. ఆ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక దీనితో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల కారణంగా స్థానిక గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. ఈ మద్దతు కూడా ఆ పార్టీకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు.

Supriya Sule: మోదీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ఒక్కరే పని చేస్తున్నారట!

రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక సీపీఐ(ఎం) నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీనియర్‌ నేతలు ప్రకాశ్‌ కారత్‌, బృందా కారత్‌, మహ్మద్‌ సలీంలతో పాటు మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి తదితరులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధీర్ చౌదరి, దీపా దాస్మున్షి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్‭లు హస్తం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ప్రచారానికి రాకపోవడం గమనార్హం.

Godavari Express Derailed: పట్టాలు తప్పినా ఎందుకు పల్టీ కొట్టలేదు? 100కి.మీ వేగంలో ఉన్న రైలు ఒక్కసారిగా ఎలా ఆగింది? గోదావరి ఎక్స్‭ప్రెస్ ప్రమాదంలో కీలక అంశాలు

వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బ‌ర్మ తన తిప్రా మోత పార్టీ కోసం ఒంటరిగా ప్రచారం చేశారు. త్రిపుర అసెంబ్లీకి రేపు పోలింగ్ ముగుస్తుంది. ఇక ఫిబ్రవరి 27న మరో రెండు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు పోలింగ్ జరుగుతుంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 3న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. త్రిపురను నిలుపుకోవడంతో పాటు, మిగిలిన రెండు రాష్ట్రాల్లో సొంతంగా అధికారాన్ని చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని నిలువరించి తమ ప్రభావాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాయి.