5వ లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు

నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.

CM Jagan Focus On YCP Fifth List

YCP Fifth List : అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జ్ ల మార్పుపైన సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. వారంతా తాడేపల్లికి వెళ్లారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పుపైన ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. రెండురోజుల్లో ఇంఛార్జ్ ల మార్పుతో వైసీపీ హైకమాండ్ 5వ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది.

నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, మంత్రులు ఉషశ్రీ చరణ్, అమర్నాథ్ కు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

Also Read : ఆయన ఆశీస్సులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్..! నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు

వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పులకు సంబంధించి సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్.. మళ్లీ పార్లమెంట్ ఇంఛార్జ్ లతో పాటు కొన్ని చోట్ల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇంఛార్జ్ ల మార్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత మంది నేతలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. వారంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వచ్చారు. అయితే, కొంతమంది ఎమ్మెల్యేలు తమ స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పుల గురించి సీఎం జగన్ తో చర్చిస్తుంటే, మరికొందరు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి చర్చిస్తున్నారు.

ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 58 మందిని ఇంఛార్జ్ లను కొత్త వాళ్లను ప్రకటించేశారు జగన్. దీంతో ఇక, చాలా తక్కువ శాతం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ ల మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇక, ఇప్పటివరకు 10 ఎంపీ స్థానాలకు ఇంఛార్జ్ లు ప్రకటించారు జగన్. ఇక మిగిలిన మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలకు సిట్టింగ్ లనే సీఎం జగన్ కంటిన్యూ చేయనున్నారని సమాచారం. మరో 10 నుంచి 12 స్థానాలకు ఇంఛార్జ్ లను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కొందరి పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి.

ఒంగోలుకు సంబంధించి చాలా రోజులుగా వివాదం కొనసాగుతోంది. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే, మాగుంటకు టికెట్ ఇప్పించాలని ఇంకా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మాజీమంత్రి బాలినేని. ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి చెవిరెడ్డి లేదా మంత్రి రోజా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక, నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేసేశారు. నరసరావుపేటకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక, గుంటూరుకు సంబంధించి కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణ.. వీరిద్దరిలో ఒక పేరును ఖరారు చేయబోతున్నారు.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

మచిలీపట్నంకు సంబంధించి చూస్తే.. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ పేరు పరిశీలనలో ఉంది. కాకినాడ, అమలాపురంకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. కాకినాడకు దాదాపుగా చలమలశెట్టి సునీల్ పేరు ఖరారైంది. ఇక, రాజమండ్రికి గూడూరు శ్రీనివాస్ లేదా పద్మలత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నరసారపురం లోక్ సభ స్థానానికి శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన వారికి ఎంపీ అవకాశం ఇచ్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది.