YCP Election Campaign
YCP Election Campaign : ఎల్లుండి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలుకానుంది. ఏపీ వ్యాప్తంగా 5 రీజినల్ ఏరియాల్లో క్యాడర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. క్యాడర్ మీటింగ్స్ కి ‘సిద్ధం’ అనే పేరుని నిర్ధారించింది పార్టీ హైకమాండ్. ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్ తొలి కేడర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
30న ఏలూరులో, ఫిబ్రవరి 3న అనంతపురములో క్యాడర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మరో రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఎల్లుండి జరిగే తొలి కేడర్ మీటింగ్ పై శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.