నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర? సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల.

YS Sharmila

YS Sharmila : ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పలు అంశాల్లో జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు షర్మిల. నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టార్గెట్ చేశారు షర్మిల. సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు షర్మిల.

ఎక్స్ లో వైఎస్ షర్మిలా రెడ్డి సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు.

మహానేత YSR 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకొనే జగన్ 6వేలతో వేసింది “దగా డీఎస్సీ”. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?

2. 5ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?

4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?

5. నోటిఫికేషన్ ఇచ్చిన 30రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6రోజుల వ్యవధేనా?

6. YSR హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తు లేదా?

7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా?

8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా?

9. మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా?

నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకునే జగన్.. ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని సవాల్ విసిరారు వైఎస్ షర్మిల.

Also Read : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?