పుట్టిన బిడ్డ చనిపోయిందని కవర్ లో చుట్టి ఇచ్చిన డాక్టర్లు..కాసేపటికే కదిలిన శిశువు..!!

ప్రభుత్వ డాక్టర్ల నిర్వాకం మరోసారి బైటపడింది. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇచ్చి..చేతులు దులుపుకున్నాకు భద్రాచలంలోనే ప్రభుత్వ డాక్టర్లు..కానీ చనిపోయాడని చెప్పిన శిశువు కాసేపటికే కదలటంతో కన్నతల్లి పేగుకదిలింది. బిడ్డను తీసుకుని హాస్పిటల్ కు పరిగెత్తింది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..ఏపీలోని తూర్పుగోదావరికి చెందిన సునీత అనే గర్భిణికి ఆరునెలలకే పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను తీసుకుని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు వెంటనే కడుపులో కవల పిల్లలు ఉన్నారనీ..వారి ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదనీ..వెంటనే అబార్షన్ చేయకపోతే తల్లికి ప్రమాదమనీ చెప్పారు. దీంతో భయపడిన గర్భిణి బంధువులు వేరే దారిలేక అబార్షన్ చేయమని చెప్పగా డాక్టర్లు అబార్షన్ చేశారు.
అబార్సన్ చేసిన డాక్టర్లు ఇద్దరు పిల్లల్ని బైటకు తీశారు. అలా బైటకు తీసిన ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పి ఓ ప్లాస్టిక్ కవర్ లో ఇద్దరు శిశువులను పెట్టి ఇచ్చారు. దీంతో కడుపుడు శోకంతో తల్లి బిడ్డలు పుడతారనే ఆశపడితే నిరాశే ఎదురైందనే బాధతో గర్భిణి బంధువులు ఆ కవర్ పట్టుకుని బయలుదేరారు.
అలా వెళ్తుండగా దారిలో కవర్ లో ఉన్న కవల పిల్లల్లో మగశిశువు కదలటంతో వారు ఉలిక్కిపడ్డారు.
దీంతో వెంటనే తండ్రి ఆ కవర్ పట్టుకుని తిరిగి హాస్పిటల్ కు చేరుకుని డాక్టర్లకు విషయం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు బాబుకు చికిత్స ప్రారంభించారు. అబార్షన్ చేసిన తరువాత ఆ శిశువులు బతికి ఉన్నారో లేదా అనేవిషయంకూడా పట్టించుకోకుండా ఏదో మాంసాన్ని పొట్లం కట్టి ఇచ్చేసినట్లుగా ఓ ప్లాస్టిక్ కవర్ లో శిశువులను పెట్టి ఇచ్చేశారు డాక్టర్లు. దీనిపై గర్భిణి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
డాక్టర్లు చెప్పింది నమ్మి తాము ఆ శిశువులను ఖననం చేసేసి ఉంటే బతికి ఉన్న తమ బిడ్డను చేతులారా పాతి పెట్టి..చంపేసినవాళ్ల అయ్యేవాళ్లం కదాని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.