Kamada Ekadashi 2026 : మార్చి 29 ఆదివారం + కామద ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

Kamada Ekadashi 2026 : ఈసారి కామద ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఇది ఆదివారం వస్తుంది. మరి ఆ రోజు కొన్ని పనులు చేయవద్దంటున్నారు.

kamada ekadashi on 2026 march 29 avoid to do these things

Kamada Ekadashi 2026 : సనాతన ధర్మం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ పవిత్ర వ్రతాన్ని ప్రతి నెలా కృష్ణ పక్ష, శుక్ల పక్ష ఏకాదశులు రెండు వస్తాయి. అలానే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. అలానే చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని కామద ఏకాదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరం మార్చి 29, ఆదివారంనాడు కామద ఏకాదశి వస్తుంది. ఆరోజున ఉపవాసం ఉండి.. నిర్దేశించిన ప్రకారం విష్ణుమూర్తిని పూజిస్తే.. ఆయన అనుగ్రహం మెండుగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అలానే ఈ కామద ఏకాదశి ఉపవాస వ్రతం.. బ్రహ్మహత్య వంటి దారుణ పాపాల నుంచి కూడా విముక్తిని ఇస్తుందంటున్నారు పండితులు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కామద ఏకాదశి నాడు కొన్ని పనులు అస్సలు చేయవద్దంటున్నారు పండితులు. ఆ వివరాలు..

కామద ఏకాదశి తేదీ
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు. మార్చి 28, 2026న ఉదయం 8:45 గంటలకు కామద ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు, అంటే మార్చి 29, 2026న ఉదయం 7:46 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అందువల్ల సూర్యోదయ తిథి ప్రకారం మార్చి 29, ఆదివారం నాడే కామద ఏకాదశి వ్రతం పాటిస్తారు.

కామద ఏకాదశి నాడు చేయకూడని పనులు:

  • కామద ఏకాదశి నాడు.. అన్నం, గోధుమలు, క్యారెట్, క్యాబేజీ, పాలకూర, పప్పులు, వంకాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
  • ఏకాదశి ఉపవాస సమయంలో.. అవిసె గింజలు తినవద్దంటున్నారు పండితులు.
  • తులసి అంటే శ్రీమహావిష్ణువుకు మహా ప్రీతి. అందుకే ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. పూజ కోసం కావాలంటే ఒక రోజు ముందుగానే కోసిన తులసిని వాడుకోవాలి.
  • కామద ఏకాదశి వేళ గడ్డం, జుట్టు, గోళ్లు కత్తిరించడం వంటి పనులను చేయవద్దు.
  • కామద ఏకాదశి నాడు ఎవ్వరినీ తిట్టకూడదు.. పేదలను అవమానించకూడదు. ఎవరితో గొడవ పడకూడదు.
  • కామద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి.. రాత్రంతా మేలుకుని మహావిష్ణువును ధ్యానిస్తే చాలా మంచిది అంటున్నారు.
  • ఏకాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు.
  • కామద ఏకాదశి నాడు పాత బట్టలు, నూనె, నల్ల రంగు వస్తువులు, ఇనుప వస్తువులు, ఆహారం చేయకూడదు.
  • పైన పేర్కొన్న నియమాలను పాటిస్తూ.. భక్తిశ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అంతా మంచే జరుగుతుందంటున్నారు పండితులు

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకులు ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. 10tv దీన్ని ధృవీకరించడం లేదు.