Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ అంటే ఏంటి.. ఆ రోజు బంగారం తప్పకుండా కొనాలా.. శాస్త్రాలు ఏం చేబుతున్నాయంటే..
Akshaya Tritiya 2026 : ఈ సంవత్సరం అక్షయ తృతియ ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు బంగారం కొనాలా అంటే..
akshaya tritiya 2026 meaning benefits beyond gold what you really do On this auspicious day
Akshaya Tritiya 2026 : హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఎంతో శుభదినంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే చాలా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అలానే అక్షయ తృతీయ నాడు కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభిస్తే ఇక వెనుతిరిగి చూసే పని లేదని భావిస్తారు. అందుకే చాలా మంది ఈ రోజు కొత్తగా చేపట్టబోయే పనులు, వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మూడో రోజు, అనగా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు.
ఈ ఏడాది ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వచ్చింది. ఆ రోజు బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని నమ్ముతారు. కానీ పండితులు మాత్రం తప్పకుండా బంగారం కొనాలని నియమం ఎక్కడా లేదంటున్నారు. అక్షయ అంటే తరగనిది అని అర్థం. కనుక ఆ రోజు బంగారం కొనే బదులు దానధర్మాలు చేస్తే తరగని పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. అలానే అక్షయ తృతీయ రోజున చెప్పులు, నీటి కుండ దానం చేయడం చాలా మంచిదట. దీని వల్ల అదృష్టం కలిసి రావడమే కాకుండా సంపద కూడా పెరుగుతుందట. కనుక అక్షయ తృతీయ అనగానే అప్పులు చేసి మరీ బంగారం కొని లేనిపోని ఇబ్బందుల్లో పడవద్దని పండితులు సూచిస్తున్నారు.
