Shani Jayanti-Vaishakha Amavasya 2026 : వైశాఖ అమావాస్య+శని జయంతి.. ఈ ఒక్క పని చేయండి… శని భాధలన్ని తొలగి.. ఊహించని ధన లాభం..!
Shani Jayanti-Vaishakha Amavasya : శని జయంతి, వైశాఖ అమావాస్య కలిసి వస్తున్నాయి. ఆ రోజు ఈ పనులు చేస్తే శని బాధలు తొలగుతాయి అంటున్నారు.
shani jayanti and vaishakha amavasya 2026 follow these remedies to over come saturn problems
Shani Jayanti-Vaishakha Amavasya : వైశాఖ అమావాస్య రోజే శని జయంతి కూడా వస్తోంది. ఏప్రిల్ 17, శుక్రవారం నాడు వైశాఖ అమావాస్య, శని జయంతి. ఆ రోజున శని దేవునికి ఇక్కడ చెప్పిన విధంగా పూజలు చేసినా.. ఇక్కడ చెప్పిన వాటిని సమర్పించినా.. చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటున్నారు. ఈ పనులు చేస్తే శని బాధలన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకు వైశాఖ అమావాస్య నాడు శని దేవుని కోసం ఏం చేయాలంటే..
తైలాభిషేకం:
శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధన లాభం కలుగుతుందంటున్నారు పండితులు.
శనీశ్వరుడి కోసం ప్రత్యేక పూజా విధానాలు:
- శని విగ్రహం పాదాల వద్ద ఈ క్రింది వాటిని ఉంచడం శుభప్రదం అని సూచిస్తున్నారు.
- జమ్మి ఆకుపై కొద్దిగా ఉప్పు రాసి ఉంచడం.
- నల్ల మినుములు ఉంచడం.
- కొద్దిగా రాళ్ల ఉప్పు ఉంచడం.
ప్రదక్షిణలు:
నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణలు చేస్తూ “ఓం శం శనేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మంచిది అంటున్నారు.
నీలం రంగు పుష్పాలు:
శని దేవుడికి నీలం రంగు పూలంటే చాలా ఇష్టం, వాటితో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు.
ఇతర పరిహారాలు
రావి చెట్టు పూజ:
వైశాఖ అమావాస్య నాడు.. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించి, 8 ప్రదక్షిణలు చేయాలి. ఇది విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని చెబుతున్నారు.
పులిహోర దానం:
కనీసం 11 మందికి నిమ్మకాయ పులిహోరను దానంగా ఇవ్వడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.
దుర్గాదేవి పూజ:
ఈ రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి, ఆ కుంకుమను బొట్టుగా ధరించడం వల్ల కష్టాలు తొలగుతాయి. అలానే
- అలానే శని జయంతి నాడు..అవసరమైన వారికి నల్లని వస్త్రాలు, గొడుగులు, పాదరక్షలు దానం చేస్తే మంచిది అంటున్నారు.
- వీరితో పాటు పారిశుధ్య కార్మికులకు, పేదలకు భోజనం పెట్టడం శని దోష నివారణకు గొప్ప మార్గాలు.
- నల్లని కుక్కలకు, కాకులకు నూనెతో చేసిన ఆహారం పెట్టడం కూడా శని ప్రభావాన్ని తగ్గిస్తుంది.
- అలానే శని జయంతి నాడు శని అష్టోత్తర శతనామావళిని పఠించడం,
- శని గాయత్రీ మంత్రం “ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః”
- లేదా “ఓం శం శనైశ్చరాయ నమః” 108 సార్లు జపించడం మంచిది.
శని దోషం ఉన్న వారు..
శని దోషం ఉన్నవారు హనుమాన్ని పూజిస్తే మంచిది అంటున్నారు. కనుక వైశాఖ అమావాస్య, శని జయంతి కలిసి వచ్చిన ఈ శుభ దినాన.. హనుమాన్ చాలీసా పఠించడం చాలా ఉత్తమం. అంటున్నారు.
పెద్దలను గౌరవించడం: పెద్దలను, వృద్ధులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
