Vaishakha Amavasya 2026 : వైశాఖ అమావాస్య + శుక్రవారం.. ఈ ఒక్క పని చేస్తే.. ఇక మీ ఇంట్లో కనక వర్షమే.. వద్దన్నా డబ్బే..!
Vaishakha Amavasya 2026 : ఎంతో విశిష్టత కలిగిన వైశాఖ అమావాస్య ఈ సారి శుక్రవారం నాడు వస్తుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
vaishakha amavasya 2026 and friday significance pitru tarpan rituals debt relief and wealth
Vaishakha Amavasya 2026 : మన జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వైశాఖ అమావాస్యకు విశిష్ట స్థానం ఉంది. మిగతా నెలల్లో వచ్చే అమావాస్యలతో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైనది అంటారు. మరి ఇంతటి విశిష్టత కలిగిన ఈ వైశాఖ అమావాస్య ఈసారి శుక్రవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం శుక్ర గ్రహానికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాగా.. అమావాస్య నాడు పితృదేవతలు భూమికి దగ్గరగా ఉంటారని నమ్ముతారు. అటువంటిది ఈ రెండు ఒకేసారి రావడం వల్ల ఆ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే.. పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి అనుగ్రహం రెండూ ఒకేసారి లభిస్తాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగి కనక వర్షం కురుస్తుందంటున్నారు పండితులు.
శుక్రవారం నాడు వచ్చిన ఈ వైశాఖ అమావాస్య నాడు ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీ అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరి, మీ ఇల్లు సంపదతో నిండిపోతుందని చెబుతున్నారు. ఇంతకూ ఏం చేయాలంటే.. వైశాఖ అమావాస్య వస్తోన్న శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో “21 బిల్వ పత్రాలను” మీకు వచ్చిన అమ్మవారి నామాలతో సమర్పించి, దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఇతర పరిహారాలు:
లక్ష్మీనరసింహస్వామి పూజ:
వైశాఖ అమావాస్య నాడు ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి ముందు దీపం వెలిగించి, రుణవిమోచన నరసింహ స్తోత్రం పఠించాలి. నరసింహస్వామి రుణ బాధల నుండి విముక్తి ప్రసాదిస్తాడు.
నువ్వుల నూనె దీపాలు:
వైశాఖ అమావాస్య సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద రెండు వైపులా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తిని నివారించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది.
కళ్లుప్పు పరిహారం:
ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని, కొద్దిగా కళ్లుప్పు వేసి.. దాన్ని ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని బయట పారబోయాలి. ఉప్పుకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం ఉంది, ఇది వాస్తు దోషాలను తగ్గిస్తుందంటున్నారు పండితులు.
రావి చెట్టు పూజ:
వైశాఖ అమావాస్య నాడు సాయంత్రం రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగించి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు.
మహాలక్ష్మీ పూజ:
ఏప్రిల్ 17 వైశాఖ అమావాస్య నాడే శుక్రవారం కనుక ఆ రోజే లక్ష్మీ దేవిని పూజించి.. కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించాలి. పూజలో కొన్ని గోమతి చక్రాలను ఉంచి, ఆ తర్వాత వాటిని ధనం ఉంచే బీరువాలో పెట్టుకుంటే అది ధనాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
