Chaitra Navratri 2026 : 72 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సంవత్సరం.. అమావాస్య, ఉగాది, చైత్ర నవరాత్రి.. అన్నీ ఒకే రోజు.. ఈ నియమాలు పాటించకపోతే..!!
Chaitra Navratri 2026 : ఉగాది పండగ నుంచి చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి వీటికో ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : March 17, 2026 / 09:46 PM IST
Chaitra Navratri 2026 Date Ghatasthapana Muhurat Rituals and Spiritual Significance
Chaitra Navratri 2026 : హిందూ సాంప్రదాయం ప్రకారం సంవత్సరంలో మొత్తం 4 నవరాత్రులు వస్తాయి. శక్తి ఆరాధన కోసం అమ్మవారిని ఈ నాలుగు సమయాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీటిలో శరన్నవరాత్రులు (దసరా) వసంత నవరాత్రులు (ఉగాది సమయంలో) అత్యంత ముఖ్యమైనవి. వసంత నవరాత్రలనే చైత్య నవరాత్రులు కూడా అంటారు. ఇవి ఉగాది పండగ నాడు ప్రారంభం అయ్యి శ్రీరామ నవమితో ముగుస్తుతాయి. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 19, గురువారం నుంచి ప్రారంభమై 27 వరకు కొనసాగుతాయి. అయితే ఈసారి నవరాత్రులు ప్రారంభమైన నాడే అమవాస్య కూడా ఉంది కనుక స్నానం, దానాలు, ఘటస్థాపన ఎప్పుడు చేయాలనే వివరాలు..
చైత్ర శుక్ల తిథి సూర్యోదయం సమయంలో నవరాత్రి ప్రారంభమవుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక విశఏషం ఉంది. అదేంటంటే.. ఈసారి చూత్ర నవరాత్రి మార్చి 19, 2026 అమావాస్య తిథితో ప్రారంభం అవుతుంది. 72 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతోంది
విశ్వసునామ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య తిథి మార్చి 19న ఉదయం 7 గంటల 17 నిముషాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి మొదలవుతుంది. అంటే సూర్యోదయం సమయానికి అమావాస్య తిథి ఉంది. మరుసటి రోజు అంటే మార్చి 20 ఉదయం 5 గంటల 55 నిముషాల వరకే పాడ్యమి తిథి ఉంది. సూర్యోదయం సమయానికి విదియ తిథి ప్రారంభమవుతుంది
ఘట స్థాపనకు ముహుర్తం..
సాధారణంగా పండగల విషయంలో సూర్యోదయం సమయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకోవాలి…అంటే మార్చి 19 గురువారం అమావాస్య తిథి ఉంది. అందుకే ఈ ఏడాది అమావాస్య, ఉగాది ఒకేరోజు వచ్చినట్లయ్యాయి. కనుక ఈ రోజు అమావాస్య నియమాలైన స్నానం, దీపం పాటించాలి. అలానే మార్చి 19, గురువారాన్నే చైత్ర నవరాత్రుల్లో తొలి రోజుగా భావించి ఘట స్థాపన కూడా చేయాలి. ఇదే రోజు ఉగాది. అన్నీ ఒకే రోజు వచ్చాయన్నమాట.
మార్చి 19న చైత్ర నవరాత్రి తొలి రోజున.. ఘటస్థాపనకు శుభ సమయం ఉదయం 6:52 గంటల నుంచి 7:43 గంటల వరకు ఉంటుంది. కలశస్థాపనకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:53 వరకు ఉందని పండితులు చెబుతున్నారు. మార్చి 19న సూర్యోదయం అమావాస్య రోజున జరుగుతుంది, కాబట్టి అమావాస్య ప్రభావం ఘటస్థాపన సమయంలో కూడా కనిపిస్తుంది. ఇది 72 సంవత్సరాల తర్వాత జరుగుతోందంటున్నారు.
చైత్ర అమావాస్య నాడు స్నానం చేయడానికి , దానం చేయడానికి శుభ సమయం మార్చి 19న ఉదయం 4:51 నుంచి 5:39 వరకు. ఈ రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో స్నానం ఆచరిస్తారు.
చైత్ర నవరాత్రి మార్చి 19 నుంచి మార్చి 27, 2026 వరకు కొనసాగుతుంది. మార్చి 28తో చైత్ర నవరాత్రి ముగుస్తుంది. చైత్ర నవరాత్రిలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను, అంటే నవదుర్గను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఉపవాసం, ఆచారాలను పాటిస్తారు. చైత్ర నవరాత్రులు పాటించడం వల్ల విజయం, సంతోషం, మనశాంతి లభిస్తాయని నమ్ముతారు.
