Lakshmi Panchami 2026 : మార్చి 23: లక్ష్మీ పంచమి+కృతిక+సోమవారం.. అతి శక్తివంతమైన కలయిక.. ఇలా చేస్తే అప్పుల భారం నుంచి విముక్తి
Lakshmi Panchami 2026 : ఈ సారి చైత్ర నవరాత్రుల్లో భాగమైన లక్ష్మీ పంచమికి అరుదైన విశేషం ఉంది. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 09:30 PM IST
chaitra navratri 2026 lakshmi panchami on march 23 monday krittika nakshatram panchami tithi significance details
Lakshmi Panchami 2026 : ఉగాది పండగ నాటి నుంచి వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మార్చి 23 నవరాత్రుల్లో 5వ రోజు. దీన్నే లక్ష్మీ పంచమి అని కూడా అంటారు. అయితే ఈసారి లక్ష్మీ పంచమికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున ముగ్గురు దేవతలు కలిసి వస్తున్నారు. లక్ష్మీ పంచమి మార్చి 23 సోమవారం వస్తుంది. పైగా కృత్తికా నక్షత్రం, పంచమి తిథి వస్తున్నాయి.
- సోమవారం: దీనికి గౌరీ శంకరులు అధిపతి.
- కృత్తికా నక్షత్రం: దీనికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయుడు).
- పంచమి తిథి: వసంత నవరాత్రులలో ఐదవ రోజున లలితా దేవి అమ్మవారు కొలువై ఉంటారు.
చైత్ర నవరాత్రుల్లో అమ్మవారు పంచమి నాడు నిలిచింది. తటస్థమై ఉంది. ఈరోజు లలితా దేవి రూపంలో కొలువై ఉంటుంది. అలాంటి పవిత్రమైన రోజున శివపార్వతులను, కార్తికేయుడిని, అమ్మవారిని తలుచుకుని పూజలు చేస్తే:
- వృత్తి, ఉద్యోగాలలో ఉన్నతి, సానుకూల మార్పులు కలుగుతాయంటున్నారు.
- ఐశ్వర్యం, సంపదలు చేకూరతాయని,
- అప్పుల బాధల నుండి విముక్తి (ఋణ విముక్తి) లభిస్తుందని చెబుతున్నారు.
జపించాల్సిన మంత్రాలు:
అన్ని రకాల కష్టాల నుండి బయటపడటానికి ఈ నామస్మరణలు చేయాలని పండితులు సూచిస్తున్నారు:
- శం శరవణభవాయ నమః – 108 సార్లు (కార్తికేయుడి కోసం).
- శ్రీమాత్రే నమః – 108 సార్లు.
- లలితా పంచరత్నం – 9 సార్లు పఠించాలి.
- శివ పంచాక్షర స్తోత్రం – 9 సార్లు పఠించాలి.
లక్ష్మీ పంచమి నాడు అమ్మవారు, అయ్యవారు, కొడుకుతో కలిసి వస్తున్నారు కనుక.. వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. కష్టాలు, బాధలు అన్ని తీరిపోతాయని.. నమ్మకంతో పూజించమని పండితులు సూచిస్తున్నారు.
