Dasara 2021 : జోగులాంబలో శరన్నవరాత్రి వేడుకలు

అక్టోబర్ 07వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ఈవో వీరేశం వెల్లడించారు.

Jogulamba Temple : దసరా మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో పలు ఆంక్షలు, నిబంధనల మధ్య వేడుకలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా..అక్టోబర్ 07వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ఈవో వీరేశం వెల్లడించారు.

Read More : IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ దే విజయం

ఉత్సవాలకు సంబంధించి ప్రచార పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఉత్సవాలు 07వ తేదీ నుంచి ప్రారంభమై..15వ తేదీతో ముగియనున్నాయని తెలిపారు. ముఖ్యమైన రోజుల్లో నిర్వహించే వేడుకలను వివరించారు. 7వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, 12వ తేదీన అమ్మవారి కళ్యాణం, 13వ తేదీన దుర్గాష్టమి నిర్వహించనున్నామన్నారు. దుర్గాష్టమి సందర్భంగా..సింహవాహన సేవ, 15వ తేదీన విజయ దశమి జరుగుతుందన్నారు. జోగులాంబ అమ్మవారి రథోత్సవం, సాయంత్రం శమీపూజ, నదీ హారతి, రాత్రి తెప్పోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ రవి ప్రకాష్ గౌడ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు