State Of Equality : రామానుజచార్యుల సువర్ణమూర్తి.. ప్రాణప్రతిష్ట, ఇక నిత్యారాధనలు

120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌తో కలిసి తొలిపూజ చేశారు...

Suvarna

Sri Ramanuja Sahasrabdi Samaroham : శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 2 నుంచి వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా… యాగశాలల వద్ద మహా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 108 దివ్యదేశాల దేవతామూర్తులకు శాంతికల్యాణం నిర్వహిస్తారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో రామానుజాచార్యుల సువర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట, కుంభాభిషేకం చేశారు. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం దివ్యదేశాల సందర్శనకు సాధారణ భక్తులను కూడా అనుమతించనున్నారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్ లోనే జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు. ఎందరో భక్తులు ఇచ్చిన విరాళాలతో 54 అంగుళాల సువర్ణ ప్రతిమను రూపొందించారు. విగ్రహం వెనుక ఉండే మకరతోరణాన్ని వెండితో తయారు చేయించారు.

Read More : Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

ఆదివారం శ్రీ భగవత్ రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌తో కలిసి తొలిపూజ చేశారు. రాష్ట్రపతి కుటుంబానికి 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు త్రిదండి చిన్నజీయర్‌స్వామి, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.